ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- ఉద్యోగులకు నిరంతర నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్న సీఎం
- ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
- వర్చువల్ కోర్సులతో స్కిల్స్ పెంచుకోవాలని సూచన
- తాగునీటి సమస్యపై నిర్లక్ష్యం వద్దని ఆదేశాలు
- ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలని సూచన
ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిరంతరం కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉద్యోగులకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ ఇప్పించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం వివిధ శాఖలు అందిస్తున్న సేవలపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్య శిక్షణ, అన్న క్యాంటీన్లు, పట్టణాల్లో తాగునీటి సరఫరా, సంక్షేమ హాస్టళ్లలో వసతులపై చర్చించారు.
కెపాసిటీ బిల్డింగ్, నైపుణ్య శిక్షణలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు చెప్పారు. ఐగాట్ కర్మయోగి ద్వారా ఉద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. రియల్‌టైమ్‌లో పనిచేసేలా ఉద్యోగులు నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. వర్చువల్ కోర్సుల ద్వారా కూడా తమ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలని చెప్పారు.
ఐఏఎస్ అధికారులు ఎప్పటికప్పుడు ఓరియెంటేషన్ తీసుకుంటూ నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటారని.. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నిరంతర నైపుణ్యాభివృద్ధి అవసరమని సీఎం అన్నారు.
పట్టణాల్లో తాగునీటి సమస్యపై కూడా సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో పట్టణాల్లో తాగునీటి సమస్య చాలా వరకు తగ్గిందని అధికారులు తెలిపారు. రాయలసీమలో రెండు మున్సిపాలిటీల్లో స్వల్పంగా సమస్య ఉందని, దాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
విశాఖపట్నంలో భూగర్భ జలాలు రీఛార్జ్ కావడంతో తాగునీటి సమస్యను అధిగమిస్తున్నామని అధికారులు వివరించారు. పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. వర్షాలు కురిశాయని నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు.
ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని సీఎం చెప్పారు. సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.