బడ్జెట్ 30 కోట్ల లోపు .. వసూళ్లు 300 కోట్లకి పైన .. ఓటీటీకి మలయాళ మూవీ!
Advertisement

బడ్జెట్ 30 కోట్ల లోపు .. వసూళ్లు 300 కోట్లకి పైన .. ఓటీటీకి మలయాళ మూవీ!

Bethlehem Kudumba Unit Movie Update
  • మలయాళంలో రూపొందిన లవ్ స్టోరీ 
  • నివిన్ పౌలీ జోడీకట్టిన మమితా బైజు
  • 25 కోట్ల బడ్జెట్ లో నిర్మితమైన సినిమా  
  • 325 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టిన కంటెంట్ 
  • అక్టోబర్ 2వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో  

చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందడం .. భారీ వసూళ్లను ఖాతాలో వేసుకోవడం మలయాళ సినిమాల విషయంలో జరుగుతూనే ఉంటుంది. క్రితం ఏడాదిలోను .. ఈ ఏడాది ఆరంభంలోను మలయాళంలో చిన్న సినిమాలు వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించాయి. మలయాళంతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాలు భారీ విజయాలను నమోదు చేయడం విశేషం. అలాంటి సినిమాల జాబితాలో తాజాగా 'బెత్లెహెం కుటుంబ యూనిట్' సినిమా కనిపిస్తుంది. 

నివిన్ పౌలి - మమితా బైజు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఆగస్టు 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. టైటిల్ ను మార్చకుండా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. అయినా తెలుగు వైపు నుంచి కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అలాంటి ఈ సినిమా 325 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఒక చిన్న టౌన్ నేపథ్యంలో నడిచే సింపుల్ లవ్ స్టోరీ ఈ స్థాయి వసూళ్లు రావడం నిజంగా గొప్ప విషయమే.

ఈ సినిమాలో హీరోకి పెళ్లీడు దాటిపోతుంది. అతను ఇక పెళ్లి విషయాన్ని పక్కన పెట్టేసి కేటరింగ్ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితులలో కొత్తగా ఆ ఊరు వచ్చిన హీరోయిన్ కి ఆయన కేరక్టర్ నచ్చుతుంది. తనకంటే అతను వయసులో చాలా పెద్దవాడైనప్పటికీ లవ్ చేయడం మొదలుపెడుతుంది. ఆ విషయం ఆమె ఇంట్లో తెలుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అనేది కథ. అక్టోబర్ 2వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో  అందుబాటులోకి వస్తున్న ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి ఏ స్థాయి ఆదరణ లభిస్తుందనేది చూడాలి.

Advertisement
Nivin Pauly
Mamitha Baiju
Bethlehem Kutumba Unit
Malayalam movie OTT release
Disney Plus Hotstar
Box office collection

More Telugu News