త్వరలో ఈఎంఐలు పెరగక తప్పదా? ఆర్‌బీఐపై పెరుగుతున్న ఒత్తిడి!
- వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఆర్‌బీఐపై పెరుగుతున్న ఒత్తిడి
- చమురు ధర 100 డాలర్లు దాటడంతో కొత్త సవాళ్లు
- రెండు వారాల్లో దాదాపు ఒక శాతం బలహీనపడ్డ రూపాయి
- రేట్లు పెరిగితే ఫ్లోటింగ్ రుణాలపై ప్రభావం
- ఈయూ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సైతం జపాన్ వడ్డీరేట్లు పెంచిన వైనం
లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐల భారం పెరగబోతుందా? ప్రస్తుతం ఆర్థిక మార్కెట్లలో ఇదే ప్రశ్న వినిపిస్తోంది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా పెరుగుతున్న వడ్డీ రేట్లు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఆర్‌బీఐ)పై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఆర్‌బీఐకి తగ్గుతోందని ‘బీఎన్‌పీ పరిబాస్ ఇండియా’ నివేదిక తెలిపింది.
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ కూడా ఐదు శాతానికి చేరువైంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే చమురు ధరలు ఇంకా పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇది భారత్‌లో ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపొచ్చని నివేదిక పేర్కొంది.
మరోవైపు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచాయి. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరిగితే భారత్ నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లే ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి ఇప్పటికే దాదాపు ఒక శాతం బలహీనపడింది.
ఈఎంఐలపై ప్రభావం ఎలా?
ద్రవ్యోల్బణం మరింత పెరిగి.. రూపాయిపై ఒత్తిడి కొనసాగితే ఆర్‌బీఐ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి అవలంబించాల్సిన పరిస్థితి రావొచ్చు. అలా జరిగితే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫ్లోటింగ్ రేట్ గృహ, వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారిపై ప్రభావం పడొచ్చు. దీంతో ఈఎంఐ పెరగడం లేదా లోన్ టెన్యూర్ పెరగడం జరిగే అవకాశం ఉంటుంది.
దేశంలో రుణ వృద్ధి, వాహన అమ్మకాలు, ఉద్యోగ గణాంకాలు కొంత సానుకూలంగా ఉన్నా.. పట్టణాల్లో వేతనాలు తగ్గడం, వ్యాపార విశ్వాసం బలహీనపడటం, గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయని బీఎన్‌పీ పరిబాస్ తెలిపింది.