తల తెగిపోయినా వారం కంటే ఎక్కువ బతకగలిగే జీవి ఏదో తెలుసా?
- తల లేకపోయినా కొంతకాలం బతకగలిగే బొద్దింక
- సుమారు వారం వరకు బతకగలవని ఆధారాలు
- స్పైరాకిల్స్ ద్వారా శ్వాస తీసుకునే వ్యవస్థ
- తల తెగినా వెంటనే తీవ్రమైన రక్తస్రావం జరగని శరీర నిర్మాణం
- శరీరంలోని గ్యాంగ్లియా వ్యవస్థ వల్ల కదలికలు సాధ్యం
బొద్దింక.. పేరు వింటేనే చాలామందికి చిరాకు. ఇంట్లో వంటగదిలోనో, బాత్‌రూమ్‌లోనో రాత్రిపూట హఠాత్తుగా కనిపిస్తే చాలు.. దాన్ని తరిమేయడమే పని. కానీ ఈ చిన్న పురుగు గురించి కొన్ని విషయాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. వాటిలో ముఖ్యమైనది తల లేకపోయినా కొంతకాలం బతకగలగడం. సాధారణ పరిస్థితుల్లో తల కోల్పోయిన బొద్దింక సుమారు వారం రోజుల వరకు బతికిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకీ తల లేకుండా అది ఎలా బతుకుతుంది?
శ్వాసకు తల అవసరం లేదు
మనుషులు ముక్కు, నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. బొద్దింకలకు అలా కాదు. వాటి శరీరం పక్క భాగాల్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటినే స్పైరాకిల్స్ అంటారు. వీటి ద్వారా గాలి లోపలికి వెళ్లి శరీరంలోని శ్వాస వ్యవస్థకు చేరుతుంది. అందుకే తల పోయినా శరీరం వెంటనే శ్వాస ఆపేయదు. కొంతకాలం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
రక్తస్రావంతో వెంటనే చనిపోదు
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. మనుషుల శరీరంలో రక్తం రక్తనాళాల ద్వారా ఒత్తిడితో ప్రవహిస్తుంది. బొద్దింకల రక్త ప్రసరణ వ్యవస్థ అలా ఉండదు. వాటికి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. దీంతో తల తెగిపోయిన వెంటనే మనుషుల్లో మాదిరిగా తీవ్రమైన రక్తస్రావం జరగదు. గాయం కూడా కొంతవరకు మూసుకుపోతుంది. దీంతో శరీరం వెంటనే పనిచేయడం ఆపదు.
మెదడు లేకపోయినా కదులుతుందా?
అవును.. కొంతసేపు కదలగలదు. కారణం బొద్దింక నాడీ వ్యవస్థ మొత్తం మెదడుపైనే ఆధారపడి ఉండదు. శరీరంలోని వివిధ ప్రాంతాల్లో గ్యాంగ్లియా అనే నాడీకణాల సమూహాలు ఉంటాయి. ఇవి కొన్ని ప్రాథమిక కదలికలను నియంత్రించగలవు. అందుకే తల లేని బొద్దింక కదలడం లేదా తాకినప్పుడు స్పందించడం కనిపించొచ్చు.
మరి ఎక్కువకాలం ఎందుకు బతకదు?
తల లేకపోవడం వల్ల ఒక పెద్ద సమస్య మాత్రం తప్పదు. నోరు లేకపోవడంతో ఆహారం తీసుకోలేదు. నీరు కూడా తాగలేదు. ఆహారం లేకుండా బొద్దింకలు చాలాకాలం ఉండగలవు. కానీ నీరు అందకపోతే మాత్రం చివరకు చనిపోతాయి. అందుకే తల లేకుండా వారం రోజుల వరకు బతకగలదని చెప్పినా.. అది ఎప్పటికీ అలా జీవించగలదని కాదు. ఎంతకాలం బతుకుతుందనేది ఉష్ణోగ్రత, తేమ వంటి పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది.
నీటిలోనూ కొంతసేపు ఉండగలదు
బొద్దింకల శరీర నిర్మాణంలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అవసరమైనప్పుడు స్పైరాకిల్స్‌ను మూసుకోవడం ద్వారా కొంతసేపు నీటిలో ఉండగలవు. కొన్ని పరిస్థితుల్లో ఇవి 30 నుంచి 40 నిమిషాల వరకు నీటిలో ఉండగలవని చెబుతారు.