52 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా.. సీఎం విజయ్ డైట్ ఇదే!
- 52 ఏళ్ల వయసులోనూ సీఎం విజయ్ అద్భుతమైన ఫిట్‌నెస్
- కఠినమైన డైట్లకు బదులు సాధారణ ఇంటి భోజనం
- ఇష్టమైన మటన్ బిర్యానీకి డైట్‌లో చోటు
- వాకింగ్, రన్నింగ్‌తో పాటు తేలికపాటి వ్యాయామాలు
- ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్న ట్రైనర్ నరేశ్ కుమార్
తమిళనాడు ముఖ్యమంత్రిగా బిజీ షెడ్యూల్‌తో గడుపుతున్న 52 ఏళ్ల విజయ్, ఈ వయసులోనూ ఎంతో ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి గల కారణాలను ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్ నరేశ్ కుమార్ వెల్లడించారు.
కఠినమైన డైట్ నియమాలు, ఖరీదైన ఆహార పద్ధతులకు బదులుగా, విజయ్ సాధారణ ఇంటి భోజనం, క్రమమైన వ్యాయామంతోనే తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ సింపుల్ విధానమే ఆయన ఫిట్‌నెస్ మంత్రం అని స్పష్టం చేశారు.
విజయ్ దినచర్య చాలా నిలకడగా ఉంటుంది. ఆయన సాధారణంగా ఉదయం 5:30 నుంచి 6 గంటల మధ్య నిద్రలేస్తారు. ఉదయం 9 గంటల సమయంలో అల్పాహారంగా రెండు ఇడ్లీలతో పాటు గుడ్లు తీసుకుంటారు.
మధ్యాహ్న భోజనంలో అన్నంతో పాటు కూరగాయలు, పండ్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. రాత్రి భోజనం చాలా తేలికగా ఉంటుంది. ఎక్కువగా సూప్ లేదా సలాడ్ వంటివి తీసుకుంటారు.
ఆయన ఫిట్‌నెస్ కోసం రుచిలేని ఆహారాన్ని బలవంతంగా తినే రకం కాదు. తనకు ఇష్టమైన సంప్రదాయ దక్షిణ భారత వంటకాలనే పరిమితంగా తీసుకుంటారు. జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉంటారు. అప్పుడప్పుడు ఇష్టమైన మటన్ బిర్యానీని ఆస్వాదిస్తారు.
కొన్ని సందర్భాల్లో తన సన్నిహితుల కోసం ఏర్పాటు చేసే విందుల్లో కూడా బిర్యానీ వడ్డిస్తారని చెబుతారు. అలాగే శక్కరై పొంగల్ వంటి సంప్రదాయ తీపి వంటకాలను కూడా అప్పుడప్పుడు రుచి చూస్తారు.
ఆహార నియమాలతో పాటు వ్యాయామానికి కూడా విజయ్ అంతే ప్రాధాన్యత ఇస్తారు. రోజూ వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్‌తో పాటు తేలికపాటి బరువులతో ఎక్కువ రిపిటీషన్స్‌తో కూడిన వెయిట్ ట్రైనింగ్ చేస్తారు. ఒకవేళ జిమ్‌కు వెళ్లడం సాధ్యం కాకపోతే, రోజువారీ శారీరక శ్రమను పెంచుకుంటారు.
తీవ్రమైన కసరత్తుల కన్నా, నిలకడగా వ్యాయామం చేయడానికే ఆయన మొగ్గు చూపుతారు. ఈ సమతుల్య జీవనశైలే ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన శక్తిని అందిస్తోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.