సొహ్రాబుద్దీన్ కేసులో సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన నారాయణ
Advertisement

సొహ్రాబుద్దీన్ కేసులో సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన నారాయణ

Narayana welcomes Supreme Court decision in Sohrabuddin Sheikh case
  • సొహ్రాబుద్దీన్ కేసులో 22 మంది నిర్దోషిత్వంపై సుప్రీంకోర్టు విచారణ
  • 92 మంది సాక్షులు ప్లేట్ ఫిరాయించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం
  • కేసు విచారించే జడ్జిలకు ప్రత్యేక భద్రత కల్పించాలని నారాయణ డిమాండ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో 22 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కింది కోర్టులు ఇచ్చిన తీర్పును పరిశీలించేందుకు అంగీకరించింది. విచారణ సమయంలో 92 మంది ప్రాసిక్యూషన్ సాక్షులు ప్లేట్ ఫిరాయించడంపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, ఈ కేసులో గతంలోనే డిశ్చార్జ్ అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సీపీఐ సీనియర్ నేత నారాయణ స్వాగతించారు. సొహ్రాబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్ బీ, సహచరుడు తులసీరామ్ ప్రజాపతి వరుస హత్యలపై సమగ్ర న్యాయ సమీక్ష జరగాలని డిమాండ్ చేశారు. ఈ కేసును విచారిస్తున్న జడ్జి బి.హెచ్. లోయా మరణంపై అప్పట్లో పెద్ద వివాదం అయిందని చెప్పారు. అప్పట్లో గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ఈ కేసులో నిందితుడిగా ఉండి, ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కేసును విచారించే న్యాయమూర్తులకు ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించాలని, తద్వారా వారు ఎలాంటి భయాలకు, ఒత్తిళ్లకు లోనుకాకుండా విధులను నిర్వర్తించగలరని అభిప్రాయపడ్డారు.
Advertisement
Sohrabuddin Sheikh
CPI Narayana
Supreme Court
Amit Shah
Fake Encounter Case
Judge Loya

More Telugu News