‘సర్’పై వివాదాల వేళ.. ఎన్నికల సంఘానికి మహారాష్ట్ర సీఈఓ కీలక లేఖ
- ECINetలో ఈఆర్‌ఓలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని మహారాష్ట్ర సీఈఓ సూచన
- సరైన పత్రాలుంటే వ్యక్తిగత విచారణ నుంచి మినహాయించాలని సూచన
- 13 పత్రాలకే పరిమితం కాకుండా ఇతర ఆధారాలకు అవకాశం ఇవ్వాలన్న చొక్కలింగం
- లాజికల్ డిస్క్రిపెన్సీ కేసులను ఈఆర్‌ఓలే పరిష్కరించాలని సూచన
- చివరి సర్ పత్రం అప్‌లోడ్‌ను తప్పనిసరి చేయొద్దని సూచన
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ఉపయోగిస్తున్న ECINet సాఫ్ట్‌వేర్‌పై మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఎస్.చొక్కలింగం కీలక సూచనలు చేశారు. స్థానిక ఎన్నికల అధికారులకు చట్టపరంగా ఉన్న అధికారాలను సాఫ్ట్‌వేర్‌లోనూ ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. సెప్టెంబర్ 24న కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఉన్నతాధికారులకు ఆయన ఈ మేరకు లేఖ రాశారు.
చొక్కలింగం మొత్తం ఐదు మార్పులను సూచించారు. సరైన పత్రాలు సమర్పించిన ఓటర్లను వ్యక్తిగత విచారణ నుంచి మినహాయించే అధికారం ఎన్నికల నమోదు అధికారులకు (ఈఆర్‌ఓ) ఇవ్వాలని కోరారు. సర్ నోటీసుల్లో పేర్కొన్న 13 పత్రాలతో పాటు ఇతర ఆధారాలను సమర్పించే అవకాశం కల్పించాలని సూచించారు. గిరిజనులు, నిరాశ్రయులు, సెక్స్ వర్కర్ల వంటి వర్గాల వద్ద ఆ జాబితాలోని పత్రాలు లేకపోవచ్చని తెలిపారు.
ECINet గుర్తించిన ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ కేసులను జిల్లా స్థాయి అధికారులకు పంపకుండా ఈఆర్‌ఓలే పరిష్కరించే అవకాశం ఇవ్వాలని కూడా కోరారు. గత సర్ ఓటర్ల జాబితాలో తల్లిదండ్రులు, తాతల వివరాలతో పేర్లు సరిపోకపోవడం వంటి అంశాలను లాజికల్ డిస్క్రిపెన్సీగా గుర్తిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ‘ఎక్స్‌ట్రాక్ట్ ఆఫ్ లాస్ట్ సర్’ పత్రం అప్‌లోడ్ చేయడం తప్పనిసరి కాకూడదని ఆయన సూచించారు.
ఈఆర్‌ఓలకు స్పష్టమైన ఎఫ్‌ఏక్యూలు, రాతపూర్వక మార్గదర్శకాలు ఇవ్వాలని కూడా కోరారు. నోటీసులు, పత్రాల సమర్పణ, విచారణ, కేసుల పరిష్కారంపై పూర్తి వివరాలు అందులో ఉండాలని చెప్పారు.
ఈ అంశాలపై ఈసీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. లాజికల్ డిస్క్రిపెన్సీగా గుర్తించిన ఓటర్లు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదని ప్రకటించింది. బీఎల్‌ఓలు వారి ఇళ్లకు వెళ్లి పత్రాలు సేకరించి ECINetలో అప్‌లోడ్ చేయవచ్చని తెలిపింది. సాఫ్ట్‌వేర్‌ను సమీక్షించేందుకు సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.