కళ్లలో కనిపించే ఈ మార్పులు గుండెపోటుకు సంకేతాలా?
- కంటి రెటీనా ద్వారా రక్తనాళాల ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చుంటున్న నిపుణులు
- అధిక రక్తపోటు ప్రభావాలు కంటిలో కనిపించవచ్చని వెల్లడి
- రెటీనాలో చిన్న రక్తస్రావాలు హెచ్చరిక సంకేతాలని వివరణ
- గుండెపోటు, పక్షవాతం ముప్పుపై పరిశోధనలు
- యూకే బయోబ్యాంక్ అధ్యయనాల్లో కీలక వివరాలు
కళ్లు మనకు ప్రపంచాన్ని చూపించడమే కాదు.. మన శరీరంలో దాగి ఉన్న అనారోగ్య సమస్యల గురించి కూడా ముందస్తు సంకేతాలు ఇస్తాయి. ముఖ్యంగా గుండెకు ముప్పు పొంచి ఉందా? రక్తనాళాల్లో ఏవైనా మార్పులు చోటుచేసుకుంటున్నాయా? వంటి విషయాలను కంటి వెనుక భాగంలో ఉండే రెటీనా ద్వారా గుర్తించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ కంటి పరీక్షల్లోనే గుండె జబ్బుల ముప్పును అంచనా వేసే సరికొత్త విధానాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. మరి కంటిలో కనిపించే మార్పులకు, గుండె ఆరోగ్యానికి సంబంధం ఏంటి? రెటీనా పరీక్ష గుండెపోటు ముప్పును ఎలా పసిగడుతుంది?
కంటితోనే రక్తనాళాల పరిశీలన
మన శరీరంలో రక్తనాళాలను ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా నేరుగా పరిశీలించగలిగే అరుదైన భాగం రెటీనా. కంటి వెనుక ఉండే ఈ పొరలో అతి చిన్న రక్తనాళాలు ఉంటాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యలు రక్తనాళాలపై ప్రభావం చూపినప్పుడు రెటీనాలోనూ మార్పులు కనిపిస్తాయి. అందుకే కంటి పరీక్షలు కేవలం చూపు సమస్యలకే పరిమితం కాకుండా, శరీరంలోని రక్తనాళాల ఆరోగ్యాన్ని అంచనా వేయడంలోనూ ఉపయోగపడతాయని నిపుణులు వివరిస్తున్నారు.
రెటీనాలో కనిపించే హెచ్చరికలు
రెటీనాలోని రక్తనాళాల పరిమాణం, ఆకృతి, వాటి మధ్య ఏర్పడే మార్పులు ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి.
గుండెపోటు ముప్పును అంచనా వేయొచ్చా?
సాధారణంగా గుండె జబ్బుల ముప్పును అంచనా వేయడానికి వయసు, రక్తపోటు, కొలెస్ట్రాల్, ధూమపానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, కొందరిలో ఈ వివరాలు సాధారణంగానే ఉన్నా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో రెటీనా పరీక్షలు అదనపు సమాచారాన్ని అందించగలవని పరిశోధనలు సూచిస్తున్నాయి.
యూకే బయోబ్యాంక్ ఆధారంగా రూపొందించిన నమూనాలతో సహా పలు అధ్యయనాలు రెటీనాలోని రక్తనాళాల వెడల్పు, వంపులు, విభజన తీరును విశ్లేషించాయి. కృత్రిమ మేధ సాయంతో ఈ మార్పులను పరిశీలించి రక్తనాళాల వయసును అంచనా వేయవచ్చని గుర్తించాయి. ఈ విధానం గుండెపోటు, పక్షవాతం ముప్పును అంచనా వేయడంలో సాధారణ రిస్క్ కాలిక్యులేటర్లతో సమానమైన సమాచారాన్ని అందించగలదని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అయితే, ఇప్పటికే ఉన్న పరీక్షలకు రెటీనా సమాచారాన్ని జోడించడం వల్ల ప్రతిసారీ అంచనా కచ్చితత్వం గణనీయంగా పెరగడం లేదని కూడా పరిశోధనలు చెబుతున్నాయి.
కంటి పరీక్షల్లో మార్పులుంటే ఏం చేయాలి?
కంటి పరీక్షల్లో రక్తనాళాలు సన్నబడటం, అధిక రక్తపోటు ప్రభావాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారు వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. రెటీనా పరీక్ష ఒక్కటే గుండెపోటును నిర్ధారించలేదు. గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి వైద్యుల సూచనల మేరకు ఇతర పరీక్షలూ అవసరం. కంటి పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యల సంకేతాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.

- రక్తనాళాలు సన్నబడటం: అధిక రక్తపోటు కారణంగా రక్తనాళాల గోడలు మందంగా మారి, లోపలి మార్గం సన్నబడవచ్చు.
- రక్తనాళాల మధ్య మార్పులు: గట్టిపడిన ధమనులు పక్కనే ఉండే సిరలపై ఒత్తిడి కలిగించవచ్చు. దీన్ని ఏవీ నికింగ్ అంటారు.
- స్వల్ప రక్తస్రావాలు: రెటీనాలో చిన్న చిన్న రక్తస్రావాలు, మచ్చలు కనిపించడం రక్తనాళాల దెబ్బతినడానికి సంకేతం కావచ్చు.
- కొలెస్ట్రాల్ మచ్చలు: అరుదుగా రెటీనాలో పసుపు రంగులో కొలెస్ట్రాల్ గడ్డలు కనిపించవచ్చు. ఇవి తీవ్రమైన రక్తనాళాల సమస్యలకు సంకేతం కావొచ్చు.