జిన్‌పింగ్‌తో అలాంటి విషయాలేమీ చర్చించలేదు: ట్రంప్‌

జిన్‌పింగ్‌తో అలాంటి విషయాలేమీ చర్చించలేదు: ట్రంప్‌

Donald Trump clarifies no discussion with Xi Jinping on weapon sales
  • చైనాకు ఆయుధాల విక్రయంపై జిన్‌పింగ్‌తో చర్చించలేదన్న ట్రంప్‌
  • అమెరికా ఆయుధాలు మెరుగ్గా ఉంటాయని వ్యాఖ్య
  • రాయబారి వ్యాఖ్యలపై వివరాలు తెలుసుకుంటానని వెల్లడి
  • జిన్‌పింగ్‌తో సమావేశానికి 12 రేటింగ్‌ ఇచ్చిన ట్రంప్‌
  • రక్షణ అవసరాలకు చైనాపై ఆధారపడలేమని వ్యాఖ్య
చైనాకు అమెరికా సైనిక ఆయుధాలు విక్రయించే అంశంపై ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఎలాంటి చర్చలు జరపలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. చైనాకు ఆయుధాలు విక్రయించే ప్రతిపాదనను జిన్‌పింగ్‌ ముందు ఉంచారా? అని వైట్‌హౌస్‌లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. అయితే, అమెరికా ఆయుధాలు మెరుగ్గా ఉంటాయని, చైనా వాటిని కొనుగోలు చేయాలనుకోవచ్చని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

చైనాకు ఆయుధాలు విక్రయించే అంశంపై ట్రంప్‌ మాట్లాడినట్లు అమెరికా రాయబారి డేవిడ్‌ పెర్డ్యూ ఫాక్స్‌ న్యూస్‌ కార్యక్రమంలో చెప్పినట్లు ఓ విలేకరి ప్రస్తావించారు. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. ‘చైనాకా? మీరు తైవాన్‌ గురించి అడుగుతున్నారా?’ అని ప్రశ్నించారు. చైనా గురించే రాయబారి మాట్లాడారని విలేకరి స్పష్టం చేయడంతో.. ఆ విషయం తనకు తెలియదని, రాయబారిని అడిగి తెలుసుకుంటానని ట్రంప్‌ చెప్పారు. బహుశా ఆయన తైవాన్‌ గురించి మాట్లాడి ఉంటారని అభిప్రాయపడ్డారు.

ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశం అద్భుతంగా సాగిందని ట్రంప్‌ పేర్కొన్నారు. సున్నా నుంచి పది వరకు రేటింగ్‌ ఇవ్వాల్సి వస్తే.. ఆ సమావేశానికి 12 ఇస్తానని వ్యాఖ్యానించారు. ఇరువురు నేతల మధ్య గౌరవప్రదమైన వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు. అయితే, ఆ సమావేశంలో ఆయుధాల విక్రయాల ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు.

అమెరికా రక్షణ అవసరాలకు కీలకమైన ఉక్కును దేశంలోనే ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్‌ అన్నారు. యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకుల తయారీకి అవసరమైన ఉక్కు కోసం చైనాపై ఆధారపడలేమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అయోవాలో ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనను ప్రస్తావించారు. మరోవైపు, కెనడాతో వాణిజ్య సంబంధాలపై మాట్లాడిన ట్రంప్‌.. చైనాతోనూ అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
Advertisement
Donald Trump
Xi Jinping
US China weapon sales
Taiwan military sales
US China relations
White House press meet

More Telugu News