టాప్ 10 మోస్ట్ వాంటెడ్ జాబితాలో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్.. ఎఫ్‌బీఐ భారీ రివార్డ్
- ఆచూకీ తెలిపిన వారికి మిలియన్ డాలర్ల (రూ. 8.3 కోట్లు) రివార్డ్ ప్రకటన
- లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఆరోపణలు
- కెనడాలో నిజ్జర్ హత్యకు ఆదేశించాడని ఎఫ్‌బీఐ అభియోగం
- ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణించాలని ప్రజలకు ఎఫ్‌బీఐ హెచ్చరిక
భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ సతిందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తమ "టాప్ 10 మోస్ట్ వాంటెడ్" జాబితాలో చేర్చింది. అతడి ఆచూకీ తెలిపి అరెస్టుకు సహకరించిన వారికి మిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.3 కోట్లు) భారీ రివార్డును సోమవారం ప్రకటించింది. లాస్ ఏంజిల్స్ ఎఫ్‌బీఐ విభాగం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ నేర సామ్రాజ్యంలో ఉత్తర అమెరికా కార్యకలాపాలకు నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని ఎఫ్‌బీఐ ఆరోపించింది. అమెరికా, కెనడాలలో హత్యలు, కిడ్నాప్‌లు, దోపిడీలు, ఆయుధాలు, మాదకద్రవ్యాల సరఫరా వంటి అనేక నేరాల్లో అతడి ప్రమేయం ఉందని 8ఎఫ్‌బీఐ పేర్కొంది. లాస్ ఏంజిల్స్‌లోని ఫెడరల్ కోర్టులో అతనిపై పలు తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి.
2023లో కెనడాలో సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌తో కలిసి గోల్డీ బ్రార్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎఫ్‌బీఐ తన అభియోగాల్లో పేర్కొంది. గతంలో బ్రార్‌పై 50,000 డాలర్ల రివార్డ్ ఉండగా, ఇప్పుడు దాన్ని మిలియన్ డాలర్లకు పెంచారు. "గోల్డీ బ్రార్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. అతడిని అరెస్ట్ చేయడం మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం" అని ఎఫ్‌బీఐ అధికారి పాట్రిక్ గ్రాండీ తెలిపారు.
ప్రజలు అతడిని నేరుగా సంప్రదించవద్దని, అతడు ఆయుధాలు కలిగి ఉండే ప్రమాదం ఉందని ఎఫ్‌బీఐ హెచ్చరించింది. బ్రార్‌కు సంబంధించిన సమాచారం ఉంటే తమ టోల్-ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని కోరింది. పంజాబ్‌కు చెందిన బ్రార్ కోసం భారత్, కెనడా ఏజెన్సీలు కూడా గాలిస్తున్నాయి.