అదానీ గ్రూప్‌నకు సెబీ భారీ ఊరట.. రూ.1.48 కోట్లతో కేసు క్లోజ్!
- గౌతమ్ అదానీ సహా 18 మందికి ఊరట
- నాలుగు కంపెనీలపై చర్యల ముగింపు
- కనీస షేర్‌హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు
- 2020లో సెబీకి అందిన ఫిర్యాదులు
- సెబీ ఉత్తర్వులతో కేసు ముగింపు
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఊరట లభించింది. కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై అదానీ గ్రూప్‌నకు చెందిన నాలుగు కంపెనీలపై చేపట్టిన చర్యలను సెబీ ముగించింది. ఈ కేసు పరిష్కారం కోసం గౌతమ్ అదానీ సహా మొత్తం 18 మంది రూ.1.48 కోట్ల సెటిల్‌మెంట్ మొత్తాన్ని చెల్లించారు.
అదానీ గ్రూప్‌లోని కొన్ని కంపెనీలు కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనలను పాటించడం లేదంటూ 2020 జూన్, జులై నెలల్లో సెబీకి ఫిర్యాదులు అందాయి. వీటిపై ప్రాథమిక విచారణ చేపట్టిన సెబీ.. అదే ఏడాది అక్టోబర్ 23న పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించింది.
దర్యాప్తు పూర్తయిన తర్వాత 2024 సెప్టెంబర్ 27న సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2025 మార్చి 3న మరో అనుబంధ నోటీసు ఇచ్చింది. కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్‌మిషన్ (ప్రస్తుతం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్) కంపెనీలు ఈ కేసులో ఉన్నాయి.
ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకునేందుకు సంబంధిత వ్యక్తులు సెబీకి ప్రతిపాదన పంపారు. ఆరోపణలను అంగీకరించకుండా, తిరస్కరించకుండా కేసును ముగించుకునేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో మొత్తం రూ.1.48 కోట్లను సెటిల్‌మెంట్ కింద చెల్లించారు. దీంతో గౌతమ్ అదానీ, నాలుగు కంపెనీలు, మరో 13 మందిపై కొనసాగుతున్న చర్యలను ముగిస్తున్నట్లు సెబీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.