అధికారంలో ఉన్నా టీడీపీకి తగ్గిన ఫండ్స్... వైసీపీ విరాళాల్లో భారీ పతనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అధికారంలో ఉన్నా టీడీపీకి తగ్గిన ఫండ్స్... వైసీపీ విరాళాల్లో భారీ పతనం

TDP funds decrease despite being in power huge fall in YSRCP donations
  • తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీల విరాళాల్లో తగ్గుదల
  • 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈసీకి నివేదికలు సమర్పణ
  • గత ఏడాదితో పోలిస్తే భారీగా పడిపోయిన వైసీపీ ఫండ్స్
  • అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీ విరాళాల్లోనూ తగ్గుముఖం
  • టీడీపీకి అత్యధికంగా ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి విరాళం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం (టీడీపీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లకు అందిన విరాళాలు గత ఆర్థిక సంవత్సరంలో తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినప్పటికీ టీడీపీకి విరాళాలు తగ్గగా, ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీకి అందిన విరాళాల్లో భారీ పతనం నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, రూ. 20 వేలకు మించి స్వీకరించిన విరాళాల వివరాలను ఆయా పార్టీలు భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) నివేదించాయి.

ఈ నివేదికల ప్రకారం, 2025-26లో వైసీపీకి కేవలం రూ. 24.31 కోట్ల విరాళాలు మాత్రమే అందాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఈ మొత్తం రూ. 140.04 కోట్లుగా ఉండటం గమనార్హం. అంటే, వైసీపీకి అందిన విరాళాలు సుమారు 82 శాతం మేర క్షీణించాయి. మరోవైపు, అధికార టీడీపీకి రూ. 58.25 కోట్ల విరాళాలు రాగా, అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ. 83.03 కోట్లుగా ఉంది. అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి అందిన విరాళాలు కూడా దాదాపు 30 శాతం మేర తగ్గుముఖం పట్టాయి.
Advertisement
Telugu Desam Party
YSR Congress Party
Political Donations
Andhra Pradesh Politics
Election Commission of India
Party Funds Report

More Telugu News