యువకుడిపై చేయి చేసుకున్న మంత్రి... తీవ్రంగా స్పందించిన రాహుల్ గాంధీ
- ఢిల్లీలో యువకుడిపై చేయి చేసుకున్న మంత్రి పర్వేశ్ వర్మ
- ఘటనపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
- బీజేపీ నేతలకు ఓటర్లంటే భయం లేదంటూ విమర్శ
- ఇదంతా అధికార అహంకారమేనని రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
- ఆయనకు విషయం తెలియదంటూ మంత్రి కౌంటర్
ఢిల్లీలో ఓ యువకుడిపై బీజేపీ మంత్రి భౌతిక దాడికి దిగిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. అధికార మదంతో బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారని, వారికి ఓటర్లంటే కనీస భయం లేదని ఆయన ధ్వజమెత్తారు.
వివరాల్లోకి వెళితే... ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి పర్వేశ్ వర్మ ఆదివారం తన నియోజకవర్గ పరిధిలోని తిలక్ నగర్‌లో రోడ్ల పనులను తనిఖీ చేశారు. ఆ సమయంలో ఓ యువకుడు రహదారుల నిర్మాణంలోని లోపాలపై ప్రశ్నిస్తూ వీడియో తీయడం ప్రారంభించాడు. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి ఆ యువకుడి చెంపపై కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఉదంతంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. "ప్రజలు బహిరంగంగా ప్రశ్నిస్తే చెంపదెబ్బ, పేపర్ లీకేజీలపై నిలదీస్తే లాఠీఛార్జ్, పార్లమెంటులో గళమెత్తితే మైక్ ఆఫ్ చేయడం.. ఇవన్నీ అధికార అహంకారానికి నిదర్శనం" అని ఆయన పేర్కొన్నారు. ఓట్లు దొంగిలించి అధికారంలోకి వస్తున్నందునే, తప్పు చేస్తే ప్రజలు గద్దె దించుతారన్న భయం వారిలో లేకుండా పోయిందని రాహుల్ ఆరోపించారు. ఇలాంటి పార్టీలకు ప్రజల మద్దతుతో పనిలేదని ఆయన వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ విమర్శలపై మంత్రి పర్వేశ్ వర్మ స్పందించారు. ఈ విషయం గురించి రాహుల్‌కు కనీస అవగాహన లేదని, ఆయన ఇటువంటి అంశాలకు దూరంగా ఉంటేనే మంచిదని హితవు పలికారు.