Advertisement

హెచ్-1బీ వీసాలో భారీ మార్పులు.. ఏడాదిలో కొత్త రూల్స్!

International
Advertisement
  • విదేశీ కార్మిక వీసా మోసాలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కార్
  • అరెస్టులకు సిద్ధంగా ఉన్నామన్న అమెరికా కార్మిక శాఖ ఉన్నతాధికారి
  • కాగ్నిజెంట్, క్లౌడెరా వంటి సంస్థల వీసా దరఖాస్తులు సస్పెండ్
  • అమెరికన్ల ఉద్యోగాల పరిరక్షణే లక్ష్యంగా కఠిన చర్యలు
అమెరికాలో అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా విధానం రాబోయే ఏడాది కాలంలో గణనీయంగా మారనుంది. విదేశీ కార్మిక వీసాల విషయంలో జరుగుతున్న మోసాలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో ఈ మార్పులు అనివార్యమని తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి'ఎస్పోసిటో స్వయంగా వెల్లడించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. రాబోయే 365 రోజుల్లో విదేశీ కార్మిక వీసా కార్యక్రమంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని స్పష్టం చేశారు. మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయని తెలిపారు. 

"అరెస్టులకు మేం సిద్ధంగా ఉన్నాం. వాస్తవాలను అమెరికా ప్రజల ముందు ఉంచుతున్నాం" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు హెచ్-1బీ వీసా మోసాలపై ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందో తెలియజేస్తున్నాయి.

ఇప్పటికే కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయం ఈ విచారణలో భాగంగా డజన్ల కొద్దీ సబ్‌పోనాలు జారీ చేయడంతో పాటు, పలు సంస్థల్లో సెర్చ్ వారెంట్లు కూడా అమలు చేసింది. ముఖ్యంగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా కాగ్నిజెంట్, క్లౌడెరా వంటి కొన్ని కంపెనీలకు సంబంధించిన వీసా దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేశారు. 

నకిలీ దరఖాస్తులు, వేతనాల్లో అవకతవకలు, కార్మికుల దోపిడీ, అమెరికన్ ఉద్యోగులను తొలగించడం వంటి అంశాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలు ప్రభుత్వ విస్తృత వ్యూహంలో భాగమని స్పష్టమవుతోంది. 

ఇప్పటికే కొంతమంది హెచ్-1బీ వర్కర్ల ప్రవేశంపై ఆంక్షలను పొడిగించిన ప్రభుత్వం, వీసా దరఖాస్తులను సమీక్షించేటప్పుడు కంపెనీలు గతంలో ఉద్యోగులను తొలగించిన చరిత్రను (లేఆఫ్స్) కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏజెన్సీలను ఆదేశించింది. 

స్థానిక టెక్ ఉద్యోగాలను విదేశీ నిపుణులతో భర్తీ చేయకుండా నిరోధించేందుకు గతంలో 'ప్రాజెక్ట్ ఫైర్‌వాల్' వంటి కార్యక్రమాలను కూడా చేపట్టారు. 

కొన్ని కంపెనీలు, ఔట్‌సోర్సింగ్ సంస్థలు అమెరికన్ల వేతనాలను, ఉద్యోగాలను దెబ్బతీసేందుకు హెచ్-1బీ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శకులు ఆరోపిస్తుండగా, దేశంలో నిపుణుల కొరతను తీర్చడానికి ఈ వీసా ఎంతో అవసరమని దాని మద్దతుదారులు వాదిస్తున్నారు. 

ఏదేమైనా ప్రస్తుత దర్యాప్తులు, ప్రభుత్వ సంకేతాలను బట్టి చూస్తే, సమీప భవిష్యత్తులో హెచ్-1బీ విధానంలో కఠినమైన నిబంధనలు, నిర్మాణాత్మక సంస్కరణలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

H-1B VisaDonald TrumpAnthony DEspositoUS Department of LaborVisa Fraud InvestigationUS Immigration Rules

More Telugu News

వాతావరణ మార్పుల సూచీలో భారత్‌కు 28వ ర్యాంకు.. తొలి మూడు స్థానాలు ఖాళీ!

12 Nov, 15:48

యూపీ ఎన్నికల్లో కొత్త కూటమి.. చేతులు కలిపిన ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్

12 Nov, 15:41

2047 వరకు వేచి చూడాల్సిన పనిలేదు.. అంతకంటే ముందే వికసిత భారత్: ప్రధాని మోదీ

12 Nov, 15:38

జియో తరహాలోనే గ్రీన్ ఎస్‌ఎమ్ వ్యూహం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

12 Nov, 15:36

మీర్‌పేటలో దారుణం.. మహిళను హతమార్చి బంగారు ఆభరణాల దోపిడీ.. తెలిసిన వారే చంపారా?

12 Nov, 15:32

ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే సహించేది లేదు.. మంత్రి పొన్నం హెచ్చరిక

12 Nov, 15:29

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం.. 15 నాటికి వాయుగుండం!

12 Nov, 15:28

సత్తా చాటుతున్న ఆసీస్ యువ సంచలనం.. సీజన్‌లో మూడో సెంచరీతో టెస్టు రేసులోకి శామ్ కాన్‌స్టాస్

12 Nov, 15:15

నాలుగో వన్డేకు కొత్త టీమిండియా.. కెప్టెన్ గా అయ్యర్‌.. టీమ్ లో కీలక మార్పులు!

12 Nov, 15:12

కరీనా కపూర్ ధరించిన లాకెట్‌పై వివాదం.. అండగా నిలిచిన హిందూ సంస్థ

12 Nov, 15:08

ముంబై లోకల్ రైలులో దారుణం.. వేధింపులను ప్రతిఘటించిన యువతిని తోసేయడంతో తెగిపడిన చేయి!

12 Nov, 14:52

'పుష్పక విమానం' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

12 Nov, 14:51

ఏపీలో పెండింగ్‌లో ఉన్న 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

12 Nov, 14:48

అరవింద్ కేజ్రీవాల్, ఆయన కుమార్తెకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు

12 Nov, 14:38

అల్లరి నరేశ్‌ ‘ఆల్కహాల్‌’ విడుదల తేదీ ఖరారు.. సత్యతో కలిసి కామెడీ పంచేందుకు రెడీ

12 Nov, 14:35
..More Telugu News