సాంబారులో బల్లి.. ఆసుపత్రి పాలైన 19 మంది విద్యార్థినులు
- తుని ప్రభుత్వ బాలికల కళాశాల హాస్టల్‌లో ఘటన
- భోజనం తిన్న 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన వైనం
- బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందస్తున్న వైద్యులు
- విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
తూర్పుగోదావరి జిల్లా తునిలో విషాహారం ఘటన కలకలం రేపింది. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వసతి గృహంలో వండిన సాంబారులో బల్లి పడటంతో 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నిన్న మధ్యాహ్నం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కళాశాల హాస్టల్‌లో నివసిస్తున్న 49 మంది విద్యార్థినులు నిన్న మధ్యాహ్నం భోజనం చేశారు. భోజనం చేసిన కాసేపటికే 19 మంది విద్యార్థినులకు కడుపునొప్పి ప్రారంభమైంది. అనుమానంతో వారు సాంబారు గిన్నెను పరిశీలించగా, అందులో చనిపోయిన బల్లి కనిపించడంతో విద్యార్థినులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ వెంటనే స్పందించి వైద్యులకు సమాచారం అందించారు.
సాయంత్రం సమయానికి విద్యార్థినులకు కడుపునొప్పి తీవ్రం కావడంతో వారిని హుటాహుటిన తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. మహేశ్వరరావు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా రాత్రంతా వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. టీడీపీ నాయకులు యినుగంటి సత్యనారాయణ, మోదుకురి వెంకటేశ్, మళ్ల గణేశ్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.