నాకు అత్తగారంటేనే ఇష్టం: కేబీసీలో అసలు విషయం చెప్పిన అమితాబ్ బచ్చన్
- 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో అమితాబ్‌కు ఎదురైన సరదా ప్రశ్నలు
- అత్తగారింట్లో ఎవరంటే ఎక్కువ ఇష్టమని అడిగిన కంటెస్టెంట్
- మామగారి కన్నా అత్తగారంటేనే ఇష్టమని చెప్పిన బిగ్ బీ
- అత్తగారింటిని మిస్ అవుతారా? అనే ప్రశ్నకు చమత్కారంగా బదులు
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (కేబీసీ) సీజన్ 18లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. హాట్ సీట్‌లో కూర్చున్న అహేలి అనే కంటెస్టెంట్, అమితాబ్‌ను సరదాగా కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడిగారు. అమితాబ్ భార్య జయా బచ్చన్ బెంగాల్‌కు చెందిన వారని గుర్తుచేస్తూ, "మీరు బెంగాల్ అల్లుడు.. అందుకే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను" అంటూ ఆమె సంభాషణను ప్రారంభించారు.
ఈ క్రమంలో ఆమె, "మీ అత్తగారు, మామగారిలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం?" అని ప్రశ్నించగా.. అమితాబ్ ఏమాత్రం తడుముకోకుండా "నాకు నా అత్తగారంటేనే ఇష్టం" అని సమాధానమిచ్చారు. అనంతరం, "మీరు అత్తగారింట్లో దేనిని ఎక్కువగా మిస్ అవుతారు?" అని అహేలి మరో ప్రశ్న అడగ్గా, బిగ్ బీ తనదైన శైలిలో చమత్కరించారు. "అత్తగారింటి నుంచి వచ్చేవాళ్లు దానిని మిస్ అవ్వాలి కానీ, నేనెందుకు మిస్ అవుతాను?" అని బదులిచ్చి అక్కడ ఉన్నవారందరినీ నవ్వించారు.
ఈ సరదా సంభాషణతో కేబీసీ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇదిలావుండగా, జయ బచ్చన్ తల్లిదండ్రులు ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ తరుణ్ కుమార్ భాదురి, ఇందిరా భాదురి. అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్‌ల వివాహం 1973లో జరిగింది. వీరికి అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా అనే ఇద్దరు సంతానం ఉన్నారు.