ఏపీలో కరోనా శకం ముగిసినట్టేనా?.. మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన
- గత 33 రోజులుగా ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేద్నన్న మంత్రి
- ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు ఏవీ లేవని ప్రకటన
- గత 94 రోజుల్లో 78 మందికి పాజిటివ్
- పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామన్న మంత్రి
రాష్ట్రంలో గత 33 రోజులుగా ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదని, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య సున్నాకు చేరుకుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఈ పరిణామంతో రాష్ట్రం కరోనా మహమ్మారి నుండి దాదాపుగా విముక్తి పొందినట్లయింది.
శనివారం మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఒక్క పాజిటివ్ కేసు కూడా వెలుగు చూడలేదని ఆయన తెలిపారు. దీంతో వైద్యారోగ్య శాఖ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
గత మూడు నెలల గణాంకాలను పరిశీలిస్తే.. జూన్ 24 నుంచి సెప్టెంబర్ 25 వరకు (94 రోజులు) రాష్ట్రవ్యాప్తంగా 1,086 కరోనా నమూనాలను పరీక్షించగా, కేవలం 78 మందికి మాత్రమే వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని మంత్రి వివరించారు. వీరిలో 74 మంది ఇప్పటికే పూర్తిగా కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ 94 రోజుల్లో ఏకంగా 66 రోజుల పాటు సున్నా కేసులు నమోదు కావడం గమనార్హం.
రాష్ట్రంలో ఎక్కడా కూడా కరోనా కేసులు సమూహాలుగా (క్లస్టర్లుగా) నమోదైన దాఖలాలు లేవని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.