వైసీపీ-సీపీఐ దోస్తీపై విజయసాయిరెడ్డి ఫైర్.. సజ్జలనే టార్గెట్ చేశారా?

వైసీపీ-సీపీఐ దోస్తీపై విజయసాయిరెడ్డి ఫైర్.. సజ్జలనే టార్గెట్ చేశారా?

Vijayasai Reddy fires on YSRCP CPI alliance did he target Sajjala
  • ప్రజా సమస్యలపై సీపీఐతో వైసీపీ కలిసి పనిచేయాలన్న నిర్ణయంపై విజయసాయిరెడ్డి అసంతృప్తి
  • సోషల్ మీడియా వేదికగా సజ్జలను పరోక్షంగా టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు
  • ఇండియా కూటమిలోని పార్టీతో కలవడంపై వైసీపీ శ్రేణులకు ప్రశ్న
  • కరవుపై చర్చించేందుకు జగన్‌ను కలిసిన సీపీఐ.. సానుకూలంగా స్పందించిన అధినేత
ప్రజా సమస్యలపై సీపీఐతో కలిసి పనిచేయాలని వైసీపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పరోక్షంగా పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై చర్చించేందుకు నేడు (శనివారం) విజయవాడలో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని సీపీఐ నేతలు గురువారం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ భేటీలో ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాడాలనే ప్రతిపాదనకు జగన్ సానుకూలంగా స్పందించినట్లు సీపీఐ నేతలు వెల్లడించారు. ఈ పరిణామంపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ శుక్రవారం ఎక్స్‌ వేదికగా ఒక సంచలన పోస్ట్ చేశారు.

"వైఎస్సార్‌సీపీ.. కాంగ్రెస్‌ నాయకత్వంలోని ‘ఇండి’ కూటమిలో ఉన్న సీపీఐతో కలిసి ‘ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం’ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈరోజు సాక్షి పత్రికలో కథనం వచ్చింది. పార్టీ అధ్యక్షుడికన్నా ఎత్తు కుర్చీలో కూర్చున్న సార్‌గారు, తన మాజీ పార్టీతో జరిపించిన ఈ ఒప్పందం వల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయనేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణుల ఆలోచనకే వదిలేస్తున్నాను" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

"ఎత్తు కుర్చీలో కూర్చున్న సార్‌గారు" అంటూ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించే ఈ విమర్శలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Advertisement
Vijayasai Reddy
Sajjala Ramakrishna Reddy
YSRCP
CPI
Andhra Pradesh Politics
INDIA Alliance

More Telugu News