కేర్ సెంటర్‌లో మాజీ క్రికెటర్ కాంబ్లీ.. ఇంటికి తీసుకెళ్లిన భార్య
- మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ వీడియో సోషల్ మీడియాలో వైరల్
- థానె కేర్ సెంటర్‌లో ఆయన మాట్లాడిన తీరుపై అభిమానుల ఆందోళన
- తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడించిన సన్నిహితులు
- కాంబ్లీని ఇంటికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేసిన కేర్ సెంటర్ నిర్వాహకులు
- ఆయనకు ఎప్పుడైనా ఉచితంగా చికిత్స అందిస్తామని ప్రకటన
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. థానెలోని ఓ వృద్ధాశ్రమ సంరక్షణ కేంద్రంలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన ఈ వీడియోలో ఆయన మాట్లాడటానికి ఇబ్బంది పడుతుండటం అందరినీ కలవరపరిచింది. అయితే, కాంబ్లీని ఆయన భార్య ఇంటికి తీసుకెళ్లినట్లు కేర్ సెంటర్ వ్యవస్థాపకులు తాజాగా స్పష్టతనిచ్చారు.
సెప్టెంబర్ 25న బయటకు వచ్చిన ఈ వీడియోలో, కాంబ్లీ థానెలోని 'నిదాన్ సెంటర్ ఫర్ ఎల్డర్లీ కేర్'లో కనిపించాడు. "నేను ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. ఇక్కడి సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి. వాళ్ల ప్రేమ, గౌరవం చూస్తుంటే ఇంటికి దూరంగా ఉన్న భావన కలగడం లేదు" అని కాంబ్లీ అన్నాడు. అయితే, ఆయన మాటలు స్పష్టంగా లేకపోవడం, నెమ్మదిగా మాట్లాడటం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలను రేకెత్తించింది.
సచిన్ టెండూల్కర్‌కు చిన్ననాటి స్నేహితుడైన వినోద్ కాంబ్లీ, 1990లలో భారత జట్టులో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించాడు. అయితే, గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 2024 చివర్లో యూరినరీ ఇన్‌ఫెక్షన్, కండరాల బలహీనత, మెదడులో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు. ఆయనకు మధుమేహం, జ్ఞాపకశక్తి సమస్యలతో పాటు నడవడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయని సన్నిహితులు గతంలో తెలిపారు.
ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో నిదాన్ సెంటర్ వ్యవస్థాపకుడు మహేశ్ నాయక్ స్పందించారు. "కాంబ్లీ గతంలో 5-6 నెలలు మా దగ్గర ఉన్నారు. ఫిజియోథెరపీతో కోలుకున్నారు. ఇప్పుడు కూడా చికిత్స అందించాం. ప్రస్తుతం ఆయన భార్య ఇంటికి తీసుకెళ్లారు. ఆయన ఎప్పుడైనా తిరిగి రావచ్చు, చికిత్స ఖర్చులు మేమే భరిస్తాం. అతను మా హీరో" అని నాయక్ వివరించారు. కాంబ్లీ సహాయం లేకుండా నడవలేని స్థితిలో ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ వీడియో చూసిన అభిమానులు, కాంబ్లీ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.