ఉత్తరాంధ్రకు తీవ్ర వాయుగుండం ముప్పు.. సీఎం చంద్రబాబు సమీక్ష

ఉత్తరాంధ్రకు తీవ్ర వాయుగుండం ముప్పు.. సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu Naidu reviews Deep Depression threat to North Andhra
  • శ్రీకాకుళం-కవిటి మధ్య తీరం దాటనున్న వాయుగుండం
  • ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల సూచన
  • గంటకు 85 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం
  • యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రాష్ట్రం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. ఈ తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం–కవిటి మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఇది తీరం దాటే సమయంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అలాగే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, జిల్లా కలెక్టర్లు, అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Advertisement
Chandrababu Naidu
Deep Depression
Andhra Pradesh Rains
Srikakulam
Bay of Bengal
Cyclone Alert

More Telugu News