నేడు బెంగళూరుకు చంద్రబాబు.. ఎల్లుండి నుంచి కుప్పంలో పర్యటన

నేడు బెంగళూరుకు చంద్రబాబు.. ఎల్లుండి నుంచి కుప్పంలో పర్యటన

Chandrababu Naidu visits Bengaluru today and Kuppam from day after tomorrow
  • కుప్పంలో రూ.289.5 కోట్ల పనులకు ప్రారంభోత్సవం
  • రూ.38.5 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన
  • రాష్ట్రవ్యాప్తంగా రూ.9,000 కోట్ల హ్యామ్ పనులను ప్రారంభించనున్న సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెంగళూరు, కుప్పంలలో పర్యటించనున్నారు. నేడు బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరై, ఆ తర్వాత సోమ, మంగళవారాల్లో తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తారు. ఈ రెండు రోజుల పర్యటనలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

పర్యటన వివరాల ప్రకారం.. చంద్రబాబు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరుతారు. అక్కడ 'ది ఎర్త్ సెంటర్, విస్టా స్పేసెస్' ప్రారంభోత్సవంలో పాల్గొని, రాత్రికి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం బెంగళూరు నుంచి నేరుగా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లికి చేరుకుంటారు. అక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు జలహారతి ఇచ్చాక, కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు.

ఈ పర్యటనలో భాగంగా మొత్తం రూ.289.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, రూ.38.5 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. రైతు బజార్‌ నిర్మాణానికి కూడా పునాదిరాయి వేస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొని, కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదే రోజు రాత్రి కుప్పం రైల్వే స్టేషన్‌లో దాదర్–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు హాల్ట్‌ను ప్రారంభిస్తారు.

ఇక పర్యటనలో రెండో రోజైన మంగళవారం.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన రూ.9,000 కోట్ల విలువైన హ్యామ్ పనులను కుప్పం నుంచే ప్రారంభిస్తారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలతో సమావేశమై, పార్టీ కేడర్‌తో భేటీ అవుతారు. ఈ కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రానికి అమరావతికి తిరిగి పయనమవుతారు.
Advertisement
Chandrababu Naidu
Kuppam
Andhra Pradesh CM
HNSS Canal
Bengaluru
Development Projects

More Telugu News