రష్యా నుంచి చమురు కొనుగోళ్లు.. వైఖరి మార్చుకోబోమన్న భారత్
- ఏ దేశం ఒత్తిడికీ లొంగి నిర్ణయాలు తీసుకోబోమన్న భారత్
- ప్రజల ప్రయోజనాలకే తమ ప్రథమ ప్రాధాన్యమన్న కేంద్ర ప్రభుత్వం
- తమ విదేశాంగ విధానం స్వతంత్రంగానే ఉంటుందన్న భారత్
రష్యాపై విధించిన ఆంక్షల విషయంలో ఏ దేశం ఒత్తిడికీ తలొగ్గే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ విదేశాంగ విధానం అత్యంత స్వతంత్రమైనదని, జాతీయ ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకుంటామని తేల్చిచెప్పింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 18న "లిండ్సే గ్రాహం సాంక్షనింగ్ రష్యా, ఇరాన్ యాక్ట్-2026"పై సంతకం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్పందిస్తూ.. భారత ప్రభుత్వానికి దేశ ప్రజల ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. "ప్రజలకు మేలు చేసే ప్రతి నిర్ణయాన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది. మా నిర్ణయాలు ఏ దేశ ఒత్తిడితోనూ ప్రభావితం కావు" అని ఆయన స్పష్టం చేశారు. దేశ బలం, స్థిరత్వమే తమ విదేశాంగ విధానానికి పునాదులని ఆయన వివరించారు.
అమెరికా తీసుకువచ్చిన ఈ నూతన చట్టం ప్రకారం.. రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. రష్యా నుంచి పెద్ద ఎత్తున ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా వంటి దేశాలు ఈ చట్టం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ పరిణామాల వల్ల ఇంధన, వాణిజ్య రంగాల్లో భారత్కు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. తుది నిర్ణయాలు మాత్రం దేశీయ అవసరాలు, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.