శశి థరూర్ ఇంగ్లిష్‌లో తప్పు.. వెంటనే గుర్తించిన నెటిజన్లు!
- మోదీకి విషెస్ చెబుతూ చిన్న తప్పు చేసిన థరూర్
- ‘on’ బదులు ‘in’ అని రాసిన కాంగ్రెస్ ఎంపీ
- వెంటనే ఆ తప్పును గుర్తించిన నెటిజన్లు
- టైపింగ్‌లో పొరపాటు కావొచ్చని కొందరి వాదన
- ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయన్న థరూర్
ఇంగ్గిష్ భాషపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడే తీరు, వాడే పదాలు, రచనా శైలి.. పాశ్చాత్య దేశాల పండితులను సైతం మరిపిస్తాయి. అనేక సందర్భాల్లో ఆయన వాడిన పదాలు నెట్టింట్లో చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అంతటి పట్టుకున్న వ్యక్తి ఇంగ్లిష్‌లో తప్పు చేశాడంటే ఎవరైనా నమ్ముతారా? కానీ, చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ థరూర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లో ఓ చిన్న వ్యాకరణ దోషం దొర్లింది. దాన్ని నెటిజన్లు గుర్తించడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది.
సెప్టెంబర్ 17న మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా థరూర్ ‘ఎక్స్’లో శుభాకాంక్షలు తెలిపారు. అయితే ‘ఆయన 76వ పుట్టినరోజు సందర్భంగా’ అనే అర్థం వచ్చేలా ‘on his 76th birthday’ అని రాయాల్సింది పోయి ‘in his 76th birthday’ అని రాశారు. దీంతో చిన్న తప్పిదం కాస్తా అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఆ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందించారు. ఇది వ్యాకరణ తప్పిదమా? టైపింగ్ పొరపాటా? అంటూ చర్చించారు. కీబోర్డులో ‘I’, ‘O’ అక్షరాలు పక్కపక్కనే ఉండటంతో పొరపాటు జరిగి ఉండొచ్చని కొందరు సరదాగా చెప్పారు. మరికొందరు మాత్రం థరూర్ లాంటి ఇంగ్లిష్ పండితుడి నుంచి ఇలాంటి తప్పు రావడమే ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్లు చేశారు.
అయితే ఈ విమర్శలను థరూర్ పట్టించుకోకుండా వదిలేయలేదు. ఓ నెటిజన్ కామెంట్‌కు స్పందిస్తూ తన పొరపాటును స్వయంగా అంగీకరించారు. ‘ఆయన పుట్టినరోజు సందర్భంగా’ రాయాల్సిన చోట ‘in’ వచ్చిందని, ఇలాంటి పొరపాట్లు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయని సరదాగా బదులిచ్చారు.
దీంతో ఈ చిన్న వ్యాకరణ పొరపాటు సోషల్ మీడియాలో సరదా చర్చగా మారింది. సాధారణంగా థరూర్ రాసే క్లిష్టమైన ఇంగ్లిష్ పదాల కంటే ఈసారి ఓ చిన్న పదమే అందరి దృష్టినీ ఆకర్షించింది.