రూ.335 కోట్ల మేర టోకరా.. బాధితుల్లో టేలర్ స్విఫ్ట్ భర్త.. భారత సంతతి వ్యక్తికి జైలు శిక్ష
- అమెరికాలో భారీ పెట్టుబడి మోసానికి పాల్పడిన భారత సంతతి వ్యక్తి
- సిద్ధార్థ్ జవహర్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష విధించిన యూఎస్ కోర్టు
- రూ. 335 కోట్లకు పైగా మోసం చేసినట్లు నిర్ధారణ
- బాధితుల్లో గాయని టేలర్ స్విఫ్ట్ భర్త ట్రావిస్ కెల్సీ (అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్)
- విలాసవంతమైన జీవితం కోసమే నిధులు దుర్వినియోగం
అమెరికాలో భారీ పెట్టుబడి మోసానికి పాల్పడిన కేసులో భారత సంతతికి చెందిన సిద్ధార్థ్ జవహర్‌కు అక్కడి న్యాయస్థానం 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సుమారు 31 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 335 కోట్లు) మేర ఆర్థిక మోసానికి పాల్పడినట్లు రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ కేసులో బాధితుల్లో ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ భర్త ట్రావిస్ కెల్సీ (అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్) కూడా ఉండటం గమనార్హం.
టెక్సాస్‌కు చెందిన 'స్విఫ్టార్క్ క్యాపిటల్ ఎల్ఎల్‌సీ' అనే సంస్థకు సిద్ధార్థ్ జవహర్ సహ వ్యవస్థాపకుడు. ఇతనిపై 2023లో అభియోగాలు నమోదవ్వగా, సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం కోర్టు తీర్పు వెలువరించింది. 11 ఏళ్ల జైలు శిక్షతో పాటు, బాధితులైన 64 మందికి 31.35 మిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాలని జవహర్‌ను న్యాయస్థానం ఆదేశించింది.
మోసం సాగింది ఇలా..
పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధులను జవహర్ 'ఫిలిప్ మోరిస్ పాకిస్థాన్' (పీఎంపీ) అనే కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. అయితే, ఆ పెట్టుబడి విలువ భారీగా పడిపోయినప్పటికీ, ఆ నష్టాలను కప్పిపుచ్చి లాభాలు వస్తున్నాయని మదుపర్లను నమ్మించాడు. 2016 నుంచి 2023 మధ్య కాలంలో సుమారు 35 మిలియన్ డాలర్లు సేకరించిన ఆయన, అందులో కేవలం 10 మిలియన్ డాలర్లను మాత్రమే పెట్టుబడిగా పెట్టాడు.
కొత్త పెట్టుబడిదారుల నుంచి వచ్చిన డబ్బును పాతవారికి చెల్లిస్తూ (పోంజీ స్కీమ్) తరహాలో ఈ మోసానికి పాల్పడ్డాడు. మిగిలిన నిధులను తన జల్సాల కోసం ప్రైవేట్ జెట్లు, లగ్జరీ హోటళ్లు, ఖరీదైన దుస్తులు, రెస్టారెంట్ల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. పెట్టుబడిదారుల నమ్మకాన్ని జవహర్ పూర్తిగా దుర్వినియోగం చేశాడని యూఎస్ అటార్నీ కార్యాలయం పేర్కొంది.