కర్ణాటకలో దారుణం: మాజీ సైనికుడు, కుమార్తెను పంచాయతీ కార్యాలయంలో నరికి చంపిన సోదరులు!

కర్ణాటకలో దారుణం: మాజీ సైనికుడు, కుమార్తెను పంచాయతీ కార్యాలయంలో నరికి చంపిన సోదరులు!

Brothers hack ex serviceman and daughter to death in Karnataka Panchayat office
  • ఆస్తి వివాదమే హత్యలకు ప్రధాన కారణం
  • గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే దాడి చేసిన బంధువులు
  • పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు
ఆస్తి వివాదం కారణంగా ఓ మాజీ సైనికుడిని, ఆయన కుమార్తెను బంధువులే అత్యంత కిరాతకంగా నరికి చంపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా భయబ్రాంతులకు గురిచేసింది. కర్ణాటకలోని బెళగావిలో జరిగిందీ ఘటన.

అవరాడి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు రుద్రప్ప కుందరగి (67), తన కుమార్తె శశికళ (26)తో కలిసి కిత్తూరు తాలూకాలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. ఆస్తికి సంబంధించిన పత్రాల పని మీద బుధవారం వారు ఆఫీసుకు వచ్చారు. గతంలో కోర్టు ఆదేశాల ప్రకారం 38 గుంటల భూమిని రుద్రప్ప, ఆయన సోదరులకు పంచారు. అయితే, తన వాటా భూమిని అమ్మేసిన రుద్రప్ప, మిగిలిన భూమిలో కూడా వాటా కావాలని అడగడంతో వివాదం కొనసాగుతోంది.

ఈ క్రమంలో రుద్రప్ప పంచాయతీ కార్యాలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న ఆయన సోదరులు బసప్ప, సంగప్ప, మేనల్లుడు మడివాళప్ప అక్కడికి చేరుకున్నారు. వేటకొడవళ్లు, రాడ్లతో రుద్రప్పపై దాడికి పాల్పడ్డారు. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన శశికళను కూడా వదలకుండా కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనలో రుద్రప్ప కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, అతడిని ఆసుపత్రికి తరలించారు.

పంచాయతీ అధికారి, సిబ్బంది చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కె.రామరాజన్ తెలిపారు. నిందితులకు ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  
Advertisement
Rudrappa Kundaragi
Karnataka double murder
Belagavi crime news
Ex-serviceman killed
Property dispute murder
Kittur Panchayat office

More Telugu News