సరైన తోడు దొరికితే రెండో పెళ్లికి సిద్ధం: సీనియర్ నటి ప్రేమ

సరైన తోడు దొరికితే రెండో పెళ్లికి సిద్ధం: సీనియర్ నటి ప్రేమ

  • రెండో పెళ్లికి సిద్ధమన్న సీనియర్ నటి ప్రేమ
  • సరైన వ్యక్తి దొరికితే 70 ఏళ్లలోనైనా వివాహం చేసుకుంటానని వెల్లడి
  • తనకు క్యాన్సర్ అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమన్న ప్రేమ
  • 2016లోనే భర్తతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు వెల్లడి
ఒకప్పటి ప్రముఖ హీరోయిన్, తెలుగు, కన్నడ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ప్రేమ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తోడు అనేది ముఖ్యమని, తనకు నచ్చిన, తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే రెండో వివాహం చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేసింది. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రేమ, తన పెళ్లి, విడాకుల గురించి ప్రస్తావించారు. 2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పచ్చును వివాహం చేసుకున్నానని, అయితే కొంతకాలం తర్వాత అభిప్రాయ భేదాలు రావడంతో 2016లో ఫ్యామిలీ కోర్టు ద్వారా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని చెప్పింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నట్లు పేర్కొంది.

రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ "జీవితానికి తోడు ముఖ్యం. సరైన వ్యక్తి దొరికితే 70 ఏళ్ల వయసులోనైనా పెళ్లి చేసుకుంటాను. దీనికి వయసుతో సంబంధం లేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం" అని ప్రేమ పేర్కొంది. గతంలో తన ఆరోగ్యంపై వచ్చిన వదంతులను కూడా ఆమె ఖండించింది. తనకు క్యాన్సర్ సోకిందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో, కొన్ని మాధ్యమాల్లో వచ్చే ప్రతీ వార్తను నమ్మవద్దని పేర్కొంది.
Advertisement

More Telugu News