22ఏ భూములపై గుడ్‌న్యూస్.. సీఎం రేవంత్ కీలక హామీలు
- 22ఏ సమస్యల్లో 12 అంశాలను గుర్తించినట్లు సీఎం వెల్లడి
- యూఎల్‌సీ భూములపై త్వరలో కొత్త విధానం తీసుకొస్తామని ప్రకటన
- పెండింగ్ రిజిస్ట్రేషన్లను వారంలో పరిష్కరిస్తామని హామీ
- పొరపాటున 22ఏలో చేరిన భూములు తొలగిస్తామని భరోసా
- క్రమబద్ధీకరించిన, వేలం భూములకు 22ఏ నుంచి విముక్తి కల్పిస్తామన్న రేవంత్
22ఏ భూముల సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. 22ఏ సమస్యల్లో 12 రకాల అంశాలను గుర్తించామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. యూఎల్‌సీ భూముల విషయంలో త్వరలో కొత్త విధానం తీసుకొస్తామని చెప్పారు.
అధీకృత లేఅవుట్లలో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లను వారంలో పరిష్కరిస్తామని సీఎం ప్రకటించారు. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు ఉన్న లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు కూడా చేస్తామన్నారు.
ఇకపై 22ఏ జాబితాలో భూమిని చేర్చడం, తొలగించడం కోసం స్పష్టమైన నిబంధనలు తీసుకొస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. పొరపాటున వ్యక్తిగత భూములు 22ఏ జాబితాలో చేరితే కలెక్టర్లు, ఆర్డీవోలు వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వం క్రమబద్ధీకరించిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని తెలిపారు. జీవో 166, జీవో 59, జీవో 58 కింద క్రమబద్ధీకరించిన భూములకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. వేలంలో కొనుగోలు చేసిన భూములు, బ్యాంకుల్లో తనఖా పెట్టి వేలం వేసిన భూములను కూడా 22ఏ జాబితా నుంచి తొలగిస్తామని చెప్పారు.
ధరణి వ్యవస్థపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని సీఎం విమర్శించారు. నీటి ప్రాజెక్టుల తర్వాత కేసీఆర్ దృష్టి భూములపై పడిందని ఆరోపించారు. భూదోపిడీ ఆలోచనల నుంచే ధరణి పుట్టిందన్నారు. కేసీఆర్, సోమేశ్‌కుమార్ కలిసి ధరణిని రూపొందించారని చెప్పారు.
ప్రభుత్వం కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిందన్న ఆరోపణలపైనా రేవంత్ స్పందించారు. అసలు వివాదం 3.73 లక్షల ఎకరాల ప్రైవేట్ పట్టా భూముల గురించేనన్నారు. వాటిని చూపించి కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు 2025లో నిషేధిత భూముల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచామని సీఎం తెలిపారు.