తిరుమలకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. సీఎం ప్రెస్ మీట్ పూర్తి వివరాలు ఇవిగో!
- తిరుమలను ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, సేవా కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్ ప్రణాళిక
- ఆరు కీలక సూత్రాలతో టీటీడీ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం
- భక్తులకు రూ. 2 లక్షల బీమా, వీఆర్ దర్శనం వంటి పలు నూతన సౌకర్యాల ప్రారంభం
- తిరుమలలో నెట్-జీరో కర్బన ఉద్గారాల లక్ష్యం.. 100 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళిక
- 5,000 కొత్త ఆలయాల నిర్మాణం, తిరుపతి ఆసుపత్రుల ఏకీకరణకు చారిత్రక నిర్ణయాలు
తిరుమల క్షేత్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక, సేవా కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడుతూనే, భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడం, సమాజ సేవను దైవ సేవతో అనుసంధానించడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని (టీటీడీ) కొత్త పుంతలు తొక్కించేందుకు ఒక సమగ్ర, దీర్ఘకాలిక ప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. తన తిరుమల పర్యటనలో భాగంగా రెండో రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, టీటీడీ భవిష్యత్ కార్యాచరణపై ఆయన సుదీర్ఘంగా వివరించారు.
సేవయే దైవానికి మార్గం.. ఆరు సూత్రాల ప్రణాళిక
"మానవ సేవే మాధవ సేవ" అనే సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించిన చంద్రబాబు, శ్రీవారి కృపకు పాత్రులు కావాలంటే ప్రజలకు సేవ చేయడమే ఏకైక మార్గమని ఉద్ఘాటించారు. ఈ స్ఫూర్తితో టీటీడీ కార్యకలాపాలను ఆరు ప్రధాన సూత్రాల ఆధారంగా ముందుకు నడిపించనున్నట్లు తెలిపారు.
1. అన్నదానం: ఎన్టీ రామారావు ప్రారంభించిన ఈ మహత్తర కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుస్తామని, రూ. 3,168 కోట్ల కార్పస్ ఫండ్‌తో భవిష్యత్తులోనూ నిరంతరాయంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. భక్తుల సూచన మేరకు అన్నప్రసాదంలో మజ్జిగకు బదులు పెరుగు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
2. ప్రాణదానం, వైద్య సేవలు: తాను ప్రారంభించిన ప్రాణదానం ట్రస్ట్ సహా, తిరుపతిలోని స్విమ్స్, బర్డ్, రుయా, చిన్నపిల్లల ఆసుపత్రి, నూతన కార్డియాలజీ ఆసుపత్రి, టాటా క్యాన్సర్ ఆసుపత్రి, అరవింద్ కంటి ఆసుపత్రి వంటి అన్ని వైద్యశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, ఒక అపెక్స్ బాడీని ఏర్పాటు చేస్తామన్నారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్న శ్రీవారి వైద్య సేవకుల సేవలను వినియోగించుకొని, తిరుపతిని ఒక అత్యుత్తమ వైద్య కేంద్రంగా (ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్) మారుస్తామని వివరించారు.
3. శ్రీవారి సేవకులు: ఇప్పటికే 12 లక్షల మంది నమోదు చేసుకున్న శ్రీవారి సేవకులకు ఉన్నతస్థాయిలో శిక్షణ ఇచ్చి వారి సేవలను వైద్యం, విద్య, సాంస్కృతిక రంగాల్లో వినియోగించుకుంటామని తెలిపారు. వారి నైపుణ్యాలను సమాజ సేవకు అనుసంధానం చేస్తామన్నారు.
4.విద్యాదానం: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలను పూర్తిగా ప్రక్షాళన చేసి, ఉపాధి ఆధారిత విద్యను అందిస్తామన్నారు. పాలిటెక్నిక్ కళాశాలను పీఎం-శ్రీ కింద అభివృద్ధి చేసి, తిరుపతిని పారిశ్రామిక, ఎగుమతుల హబ్‌గా మార్చేందుకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తామని చెప్పారు.
5. దేవాలయాల నిర్మాణం: శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షల వ్యయంతో 5,000 చిన్న ఆలయాలను నిర్మిస్తామని ప్రకటించారు. నియోజకవర్గ కేంద్రాల్లో రూ. 5 నుంచి 10 కోట్లతో పెద్ద ఆలయాలు నిర్మించి, వాటికి ఈ చిన్న ఆలయాలను "హబ్ అండ్ స్పోక్" నమూనాలో అనుసంధానిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు అధికంగా ఉన్న నగరాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించే ప్రణాళికను కూడా వేగవంతం చేస్తామన్నారు.
6. వృక్షో గోవిందం, పర్యావరణ పరిరక్షణ: తిరుమల కొండపై ఇప్పటికే 89.4% ఉన్న పచ్చదనాన్ని మరింత పెంచుతామని, "పవిత్ర వనం" ఏర్పాటు చేసి ఔషధ మొక్కలను పెంచుతామన్నారు. నీటి సంరక్షణ చర్యలు పూర్తి చేసి, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మారుస్తామని తెలిపారు.
తిరుమల క్షేత్రంలో నూతన సౌకర్యాలు
ఈ సందర్భంగా పలు నూతన సౌకర్యాలను చంద్రబాబు ప్రారంభించారు. రూ. 104 కోట్లతో టీసీఎస్ ఆధునీకరించిన శ్రీవారి మ్యూజియంను ఆయన సందర్శించారు. ఇందులో 14 గ్యాలరీలు, 8,000కు పైగా ప్రదర్శన వస్తువులు, 6,000 కళాఖండాలు ఉన్నాయని, దీని నిర్వహణ బాధ్యతలను కూడా ఐదేళ్ల పాటు టీసీఎస్ వారే చూసుకుంటారని తెలిపారు.
అలాగే, ప్రతి భక్తుడికి ఎల్ఐసీ ద్వారా రూ. 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని ఆధార్ ఆధారిత పేపర్‌లెస్ విధానంలో ప్రారంభించారు. క్యూ కాంప్లెక్స్‌లో భక్తుల కోసం "దుర్లభ దర్శనం" పేరుతో 13 నిమిషాల వర్చువల్ రియాలిటీ (వీఆర్) అనుభూతిని, లైవ్ మెడిటేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇది భక్తులకు మానసిక ప్రశాంతతను అందిస్తుందన్నారు. రిలయన్స్, భారత్ బయోటెక్ ఫౌండేషన్ అందించిన 32 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. వీటిని కూడా ఏసీ బస్సులుగా మార్చాలని సూచించారు.
తిరుమల.. ఒక హీలింగ్ సెంటర్
2003లో అలిపిరి వద్ద జరిగిన క్లెమోర్ మైన్ల దాడి నుంచి తనను కాపాడింది సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వర స్వామియేనని, ఇది తనకు పునర్జన్మ అని చంద్రబాబు భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. తిరుమల ఒక రాజకీయ వేదిక కాదని, కష్టాల్లో ఉన్నవారికి, ఒత్తిడికి గురైన వారికి సాంత్వన చేకూర్చే ఒక పవిత్రమైన "హీలింగ్ సెంటర్"గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. అందుకే ఇక్కడ రాజకీయాలను నిషేధించామని, భవిష్యత్తులోనూ ఆ పవిత్రతను కాపాడుతామని స్పష్టం చేశారు.
తిరుపతి అభివృద్ధి, మౌలిక వసతులు
తిరుపతి నగరాన్ని కూడా ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు స్కైవాక్ నిర్మాణం, రూ. 90 కోట్లతో కోర్టు కాంప్లెక్స్ నుంచి పద్మావతి అమ్మవారి ఆలయం వరకు 100 అడుగుల రహదారి నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని, వడమాలపేట వద్ద 5,192 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రాజెక్టుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిని ఒక "వెడ్డింగ్ డెస్టినేషన్"గా అభివృద్ధి చేసే ప్రణాళికలు కూడా ఉన్నాయన్నారు.
నెట్-జీరో, పారదర్శక పాలన
తిరుమలను "నెట్-జీరో" కర్బన ఉద్గారాల క్షేత్రంగా మార్చడమే తన లక్ష్యమన్నారు. ఏడాదిన్నరలోగా సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ వంటి మార్గాల ద్వారా 100 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసి, కొండపై అవసరాలకు వినియోగిస్తామన్నారు. వాడిన పూలతో అగరబత్తీలు, వ్యర్థాలతో బయో-గ్యాస్, నీటిని శుద్ధి చేసి ప్లాంటేషన్‌కు వాడటం వంటి "సర్క్యులర్ ఎకానమీ" విధానాలను అమలు చేస్తామన్నారు. టీటీడీ ఆస్తులు, ఆభరణాలు, నిధుల వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో ఉంచి పూర్తి పారదర్శకత పాటిస్తామని, తామంతా ధర్మకర్తలమే తప్ప పెత్తనం చేయడానికి కాదని స్పష్టం చేశారు.
శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవడం ద్వారా సంస్థపై ఆర్థిక భారం తగ్గించి, పవిత్రతను కాపాడతామని, అనవసర నియామకాలకు స్వస్తి పలుకుతామని పేర్కొన్నారు. విర్రవీగిన వారు కాలగర్భంలో కలిసిపోయారని, ధర్మాన్ని, స్వామివారి పవిత్రతను కాపాడేందుకు కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మొత్తంగా, తన విజన్ తిరుమల క్షేత్రాన్ని భావితరాలకు ఒక ఆదర్శవంతమైన, పవిత్రమైన, సుస్థిరమైన దివ్యక్షేత్రంగా అందించడమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు.