నా ఆరోపణలు అబద్ధమైతే..!: మంత్రికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే సవాల్

నా ఆరోపణలు అబద్ధమైతే..!: మంత్రికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే సవాల్

Madhavaram Krishna Rao challenges Minister over land allegations in Telangana Assembly
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు
  • హైదర్ నగర్ భూముల విషయంలో సభను తప్పుదోవ పట్టించారని ఆరోపణ
  • కాంగ్రెస్ వచ్చాక కూడా ఏడాది పాటు రిజిస్ట్రేషన్లు జరిగాయని వెల్లడి
  • అబద్ధమని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్
  • సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్
తెలంగాణ శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. మంత్రి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించిన ఆయన, తాను చెబుతున్నది అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన సవాల్ విసిరారు.

నేడు హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, హైదర్ నగర్‌లోని సర్వే నంబర్లు 145, 163 భూముల విషయంలో మంత్రి వాస్తవాలను మరుగుపరిచారని విమర్శించారు. మంత్రి పేర్కొన్నట్లుగా ఆ భూములపై ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్లు నిలిచిపోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏడాది పాటు రిజిస్ట్రేషన్లు ప్రక్రియ యథాతథంగా కొనసాగిందని ఆయన స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై 22ఏ సెక్షన్ కింద సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం కల్పిస్తే, 22ఏకు సంబంధించిన పూర్తి ఆధారాలను సభ ముందు ఉంచి తన వాదనను నిరూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, "నేను చెప్పేది అబద్ధమని తేలితే, రాజకీయ సన్యాసం తీసుకుంటాను" అని ఆయన పునరుద్ఘాటించారు.
Advertisement
Madhavaram Krishna Rao
Ponguleti Srinivas Reddy
Kukatpally MLA challenge
Telangana Assembly land dispute

More Telugu News