ట్రోఫీ విషయంలో ప్రత్యామ్నాయం సూచించిన బీసీసీఐ.. ఏసీసీ ఎందుకు నో చెప్పింది?

ట్రోఫీ విషయంలో ప్రత్యామ్నాయం సూచించిన బీసీసీఐ.. ఏసీసీ ఎందుకు నో చెప్పింది?

BCCI suggested alternative for trophy presentation why did ACC say no
  • పీసీబీ చీఫ్‌ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత మహిళల జట్టు నిరాకరణ
  • దీనికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనకు ముందుకు తెచ్చిన బీసీసీఐ
  • నఖ్వీకి బదులుగా ఏసీసీ అధికారితో ట్రోఫీ ఇవ్వాలని సూచన
  • ఖలీద్‌ సాహబ్‌తో ప్రదానం చేయాలని కోరిన బీసీసీఐ
  • ఈ ప్రతిపాదనను అంగీకరించని ఏసీసీ
ఆసియా కప్‌ ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించిన భారత మహిళల టీమ్‌ విషయంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. పాక్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ మొహ్సిన్‌ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోమని ఏషియా క్రికెట్‌ (ఏసీసీ)కి తాము ముందే చెప్పినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా తాజాగా ఎన్‌డీటీవీతో చెప్పారు. పైగా ఈ వివాదానికి పరిష్కారాన్ని కూడా సూచించినట్లు తెలిపారు.

నఖ్వీకి బదులుగా ఏసీసీ అధ్యక్షుడు లేదా ఉపాధ్యక్షుడితో ట్రోఫీ అందించాలని బీసీసీఐ కోరినట్లు సైకియా వెల్లడించారు. ఏసీసీ డిప్యూటీ ఛైర్మన్‌ ఖలీద్‌ సాహబ్‌ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగితే భారత జట్టు వేడుకకు హాజరవుతుందని తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనను ఏసీసీ అంగీకరించలేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా వెల్లడించారు.

తమ సూచనను ఎందుకు తిరస్కరించారన్న దానిపై ఏసీసీ నుంచి స్పష్టమైన కారణం రాలేదని సైకియా వ్యాఖ్యలతో తెలుస్తోంది. ఏసీసీ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో భారత జట్టు ట్రోఫీ ప్రదానోత్సవానికి హాజరుకాలేదని ఆయన చెప్పారు.

మరోవైపు మహిళల ఆసియా కప్‌ ట్రోఫీ త్వరలో భారత్‌కు చేరుతుందని సైకియా తెలిపారు. పురుషుల ఆసియా కప్‌ ట్రోఫీ కూడా భారత్‌కే వస్తుందని స్పష్టం చేశారు.
Advertisement
BCCI
Womens Asia Cup
Devajit Saikia
Mohsin Naqvi
Asian Cricket Council
Indian Womens Cricket Team

More Telugu News