సెప్టెంబర్ 19 నుంచి రుతుపవనాల తిరోగమనం

సెప్టెంబర్ 19 నుంచి రుతుపవనాల తిరోగమనం

IMD key announcement on Southwest Monsoon withdrawal
  • పశ్చిమ రాజస్థాన్ నుంచి మొదలుకానున్న ఉపసంహరణ
  • దేశవ్యాప్తంగా 15 శాతం లోటు వర్షపాతం 
  • దక్షిణ, మధ్య భారతదేశంలో కొనసాగనున్న వర్షాలు
  • ఆంధ్రప్రదేశ్‌లో 43 శాతానికి చేరిన వర్షపాతం లోటు
దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ ప్రారంభానికి సమయం ఆసన్నమైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 19వ తేదీ నుంచి పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఒక ప్రకటనలో పేర్కొంది.

సాధారణంగా సెప్టెంబర్ 17న ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియ, ఈ ఏడాది రెండు రోజులు ఆలస్యంగా మొదలవుతోంది. రాజస్థాన్‌లో ఉపసంహరణ ప్రారంభమైనప్పటికీ.. మధ్య, తూర్పు, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ 21 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ముఖ్యంగా 18 నుంచి 20 మధ్య కోస్తాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం రుతుపవనాలపై తీవ్రంగా పడింది. సెప్టెంబర్ 13 నాటికి దేశవ్యాప్తంగా 15 శాతం మేర వర్షపాత లోటు నమోదైంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 28 శాతం తక్కువ వర్షపాతం నమోదవడం గమనార్హం. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో 43 శాతం, కర్ణాటకలో 29 శాతం, కేరళలో 27 శాతం మేర వర్షపాత లోటు ఏర్పడింది.  
Advertisement
IMD
Southwest Monsoon Withdrawal
India Weather Update
Rainfall Deficit South India
Monsoon Retreat 2024
Andhra Pradesh Telangana Rain Forecast

More Telugu News