ద్రోణి, ఆవర్తన ప్రభావం.. నేడు, రేపు ఏపీలో వర్షాలు..

ద్రోణి, ఆవర్తన ప్రభావం.. నేడు, రేపు ఏపీలో వర్షాలు..

Andhra Pradesh Rains Today and Tomorrow Due to Trough and Circulation
  • కోస్తా, పలు రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
  • ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో మార్పు
  • పిడుగుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీనికి తోడు ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

దీని కారణంగా కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోని నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Advertisement
Andhra Pradesh Weather
AP Rain Alert
Bay of Bengal Trough
Coastal Andhra Rains
Rayalaseema Weather Update
AP Disaster Management

More Telugu News