ఏలూరు జిల్లాలో జనసేన ఫ్లెక్సీల ధ్వంసం.. వైసీపీపై ఆరోపణలు

ఏలూరు జిల్లాలో జనసేన ఫ్లెక్సీల ధ్వంసం.. వైసీపీపై ఆరోపణలు

Janasena banners destroyed in Eluru district allegations against YCP
  • ఏలూరు జిల్లాలో జనసేన ఫ్లెక్సీల ధ్వంసం
  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో ఉన్న ఫ్లెక్సీలు చించివేత
  • వైసీపీ నేతల పనేనని జనసేన నాయకుల ఆరోపణ
ఏలూరు జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ద్వారకాతిరుమల మండలంలో జనసేన పార్టీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం దుమారం రేపుతోంది. మండలంలోని గున్నంపల్లి, పంగిడిగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను దుండగులు చించివేసినట్లు జనసేన నాయకులు తెలిపారు.

ఈ ఫ్లెక్సీలలో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చిత్రపటాలు ఉన్నాయి. ఈ ఘటనపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ నాయకులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై జనసేన మండల పార్టీ అధ్యక్షుడు దాకారపు నరసింహమూర్తి నేతృత్వంలో ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిని గుర్తించేందుకు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
Advertisement
Pawan Kalyan
Janasena Party
Eluru District
Maddipati Venkataraju
YSRCP
Dwaraka Tirumala

More Telugu News