ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. ఇప్పుడు టాప్-10లోనూ లేరు: ఏం జరిగింది?
- బెర్నార్డ్ ఆర్నాల్డ్ టాప్-10 కుబేరుల జాబితా నుంచి ఔట్
- 143 బిలియన్ డాలర్లకు తగ్గిన ఆయన సంపద
- ఈ ఏడాదే సంపదలో 65 బిలియన్ డాలర్ల క్షీణత
- ఎల్‌వీఎంహెచ్ వ్యాపారంపై మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావం
- చైనాలోనూ ఎల్‌వీఎంహెచ్‌కు సవాళ్లు
ఫ్రెంచ్ లగ్జరీ దిగ్గజం ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన టాప్-10 జాబితా నుంచి బయటకు వచ్చారు. దీంతో ఈ జాబితాలో ప్రస్తుతం అమెరికాకు చెందిన టెక్ బిలియనీర్లదే ఆధిపత్యంగా మారింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆర్నాల్ట్ సంపద 143 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో ఆయన 96 ఏళ్ల వారెన్ బఫెట్ కంటే దిగువకు వెళ్లారు.
918.8 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత లారీ పేజ్, జెఫ్ బెజోస్, సెర్గీ బ్రిన్, మైఖేల్ డెల్ సహా టెక్ రంగానికి చెందిన అమెరికన్లు ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ సంపద సూచీ 2012లో ప్రారంభమైన తర్వాత తొలిసారి టాప్-10 స్థానాలన్నీ అమెరికన్లకే దక్కాయి.
ఈ ఏడాది ఆరంభం నుంచి ఆర్నాల్ట్ సంపద ఏకంగా 65 బిలియన్ డాలర్లు తగ్గింది. టాప్-500లో ఇదే అత్యధిక పతనం. మధ్యప్రాచ్య యుద్ధం ప్రభావంతో దుబాయ్ వంటి కీలక షాపింగ్ కేంద్రాల్లో లగ్జరీ వస్తువులకు డిమాండ్ తగ్గింది. డియోర్, లూయిస్ విట్టన్, టిఫనీతో పాటు డోమ్ పెరిగ్నాన్ షాంపేన్, హెన్నెస్సీ కాగ్నాక్ వంటి బ్రాండ్ల వ్యాపారంపై ప్రభావం పడింది.
చైనాలోనూ ఎల్‌వీఎంహెచ్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానిక టీ తయారీ సంస్థతో ట్రేడ్‌మార్క్ వివాదం అమ్మకాలపై ప్రభావం చూపింది. శుక్రవారం పారిస్ మార్కెట్‌లో ఎల్‌వీఎంహెచ్ షేర్లు 0.5 శాతం పెరిగినా.. అంతకుముందు రోజు కొద్దిసేపు ఫ్రాన్స్‌లో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా లొరియల్ దానిని అధిగమించింది.
మరోవైపు అమెరికా ఎస్‌అండ్‌పీ 500 సూచీ ఈ ఏడాది 11 శాతం పెరిగింది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డిమాండ్‌తో టెక్ కంపెనీల షేర్లు ఈ వృద్ధికి ప్రధానంగా దోహదపడ్డాయి.
2017 మార్చి 22 నుంచి ఆర్నాల్ట్ ప్రపంచ టాప్-10 ధనవంతుల్లో కొనసాగుతున్నారు. 2022 డిసెంబర్‌లో కొంతకాలం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కూడా నిలిచారు. ఉత్తర అమెరికా వెలుపల నుంచి ఆ స్థాయికి చేరిన తొలి వ్యక్తి ఆయనే. వినియోగ వస్తువుల రంగం నుంచి ఆ స్థాయికి చేరిన ఏకైక కుబేరుడూ ఆయనే.
చైనాకు చెందిన వినియోగదారులు లగ్జరీ వస్తువుల కొనుగోళ్లను భారీగా పెంచిన సమయంలో ఎల్‌వీఎంహెచ్ అత్యంత వేగంగా ఎదిగింది. 2023 ఏప్రిల్‌లో కంపెనీ షేరు రికార్డు స్థాయికి చేరింది. ఆ తర్వాత చైనాలో బలహీనమైన డిమాండ్, అమెరికా టారిఫ్‌లపై అనిశ్చితి, కొన్ని మార్కెట్లలో మద్యం వినియోగం తగ్గడం వంటి అంశాలు కంపెనీపై ప్రభావం చూపాయి.
ఆర్నాల్ట్ తర్వాత ఎల్‌వీఎంహెచ్ నాయకత్వం ఎవరి చేతుల్లోకి వెళ్తుందన్నది కూడా కీలక అంశంగా మారింది. ఆయనకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వారంతా లగ్జరీ సంస్థలోనే పనిచేస్తున్నారు. ఏప్రిల్‌లో జరిగిన వాటాదారుల సమావేశంలో తొలిసారి ఐదుగురూ మాట్లాడారు. అయితే తన తర్వాత సీఈఓగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న ప్రశ్నకు ఆర్నాల్ట్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.