రాపిడో డెలివరీ బాయ్ బరితెగింపు.. మహిళకు 'ఐ లవ్ యూ' మెసేజ్

రాపిడో డెలివరీ బాయ్ బరితెగింపు.. మహిళకు 'ఐ లవ్ యూ' మెసేజ్

Rapido delivery boy sends I love you message to woman in Noida
  • మహిళకు అసభ్యకర మెసేజ్‌లు పంపిన రాపిడో డెలివరీ రైడర్
  • 'ఐ లవ్ యూ' అంటూ సందేశం.. నోయిడాలో ఘటన
  • పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే.. కంప్లైంట్ చేసుకోమంటూ సవాల్
  • రైడర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని రాపిడో ప్రకటన
ఆన్‌లైన్ డెలివరీ సేవలను వినియోగించుకుంటున్న మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నోయిడాలో ఓ రాపిడో పార్శిల్ డెలివరీ రైడర్, మహిళను వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్శిల్ డెలివరీ చేసిన అనంతరం సదరు మహిళ వ్యక్తిగత నంబర్‌కు అసభ్యకర సందేశాలు పంపి ఆ రైడర్ బరితెగించాడు.

నోయిడాకు చెందిన ఒక మహిళ రాపిడో ద్వారా పార్శిల్ బుక్ చేసుకోగా, డెలివరీ చేసిన రైడర్ అనంతరం ఆమె వ్యక్తిగత వాట్సాప్ నంబర్‌కు "హలో, ఎలా ఉన్నారు? ఐ లవ్ యూ" అంటూ సందేశాలు పంపాడు. దీంతో దిగ్భ్రాంతికి గురైన సదరు మహిళ, ఈ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది.

అయితే, ఆ రైడర్ ఏమాత్రం భయపడకుండా "వెళ్లి ఫిర్యాదు చేసుకో" అంటూ ఆమెకు ఎదురు సవాల్ విసిరాడు. ఈ ఘటనతో ఆన్‌లైన్ ప్రయాణీకుల, పార్శిల్ డెలివరీ సేవల్లో మహిళల భద్రతతో పాటు వ్యక్తిగత డేటా గోప్యతపై కూడా పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన రాపిడో సంస్థ, ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యుడైన రైడర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
Advertisement
Rapido
Noida
Delivery Boy Harassment
Women Safety
WhatsApp Harassment
Online Delivery Safety

More Telugu News