విజయ్ కూటమికి కొత్త పేరు.. 'సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్'
- తమిళనాడు సీఎం విజయ్ కూటమికి కొత్త పేరు ఖరారు
- కూటమి చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్న సీఎం విజయ్
- సమన్వయ సమావేశానికి దూరంగా వామపక్ష పార్టీలు
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ నేతృత్వంలోని అధికారిక కూటమికి నూతన పేరు ఖరారైంది. ఈ కూటమికి "సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్" (ఎస్ఎస్‌జేవీఏ)గా నామకరణం చేశారు. చెన్నై పనైయూర్‌లోని టీవీకే ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన జరిగిన భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నూతన కూటమికి విజయ్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు.
2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన రెండో అతిపెద్ద సమావేశం ఇది. ఈ భేటీలో టీవీకే, కాంగ్రెస్, విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే), మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీల అగ్రనేతలు పాల్గొన్నారు. అయితే, ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతు తెలుపుతున్న సీపీఐ, సీపీఎం పార్టీల ప్రతినిధులు మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు.
రాబోయే రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో జరగనున్న ఉపఎన్నికల్లో సమష్టిగా పోటీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మధురాంతకం, ధరాపురం వంటి నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశముంది. కూటమి విధివిధానాలు, ఉమ్మడి కనీస కార్యక్రమం, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు వంటి కీలక అంశాలపై కూడా విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది.
లౌకికవాదం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూనే, విజయ్ పేరు స్ఫురించేలా "విక్టరీ" అనే పదాన్ని కూటమి పేరులో చేర్చడం గమనార్హం. ఈ కూటమి ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు దీటైన ప్రత్యామ్నాయంగా, మూడో ప్రధాన శక్తిగా ఎదగాలని విజయ్ వర్గం లక్ష్యంగా పెట్టుకుంది.