సంక్షేమం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు.. పెన్షన్లపై వాస్తవాలు ఇవిగో!: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- 6 లక్షల పెన్షన్లు తొలగించామన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్న కొండపల్లి శ్రీనివాస్
- హామీ మేరకు పెన్షన్‌ను రూ.4,000కు పెంచామని వెల్లడి
- గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేయలేనిది 26 నెలల్లో చేసి చూపించామన్న మంత్రి
- అర్హుల నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ
సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని, కూటమి ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్‌ను రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచి మాట నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
గత వైసీపీ ప్రభుత్వం ఏటా కేవలం రూ.250 చొప్పున పెంచుతూ ఐదేళ్లు కాలయాపన చేసిందని మంత్రి విమర్శించారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచిందని, ఏప్రిల్ నుంచి బకాయిలతో సహా లబ్ధిదారులకు అందించిందని గుర్తుచేశారు. "గత ప్రభుత్వం ఐదేళ్లలో పెన్షన్లకు ఖర్చు చేసింది రూ.91,000 కోట్లు మాత్రమే. కానీ మా కూటమి ప్రభుత్వం కేవలం 26 నెలల్లోనే రూ.73,000 కోట్లను నేరుగా లబ్ధిదారుల చేతిలో పెట్టింది," అని ఆయన వివరించారు.
6 లక్షల పెన్షన్లు తొలగించామన్నది పచ్చి అబద్ధం
ప్రభుత్వం 6 లక్షల పెన్షన్లను తొలగించిందంటూ మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు చేస్తున్న ఆరోపణలను కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది పూర్తిగా అవాస్తవమని, బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అసత్యాలు మాట్లాడటం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 65 లక్షల పెన్షన్లు ఉండగా, ప్రస్తుతం 62.10 లక్షల మందికి అందుతున్నాయని తెలిపారు. సుమారు 4.5 లక్షల మంది లబ్ధిదారులు సహజంగా మరణించడం వల్లే ఈ సంఖ్య తగ్గిందని, ప్రభుత్వం తొలగించినవి కేవలం 3,000 మాత్రమేనని, అవి కూడా నిర్దిష్ట ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపిన తర్వాతేనని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ఈ 26 నెలల్లోనే కొత్తగా 2.60 లక్షల మందికి స్పౌస్ పెన్షన్లు మంజూరు చేశామని, గత ప్రభుత్వంలో భర్త చనిపోయినా పెన్షన్ అందని లక్ష మంది అర్హులైన మహిళలకు తమ ప్రభుత్వమే న్యాయం చేసిందని తెలిపారు.
సంక్షేమంలో విప్లవాత్మక మార్పులు
సీఎం చంద్రబాబు పెన్షన్ల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని మంత్రి కొనియాడారు. గతంలో వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోతే కార్డు రద్దు చేసేవారని, ఇప్పుడు మూడు నెలల పెన్షన్‌ను ఒకేసారి తీసుకునే సౌలభ్యం కల్పించామన్నారు. పెన్షనర్ చనిపోతే వెంటనే వారి జీవిత భాగస్వామికి పెన్షన్ అందేలా 'స్పౌస్ పెన్షన్' విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3,000 నుంచి రూ.6,000కు, డయాలసిస్ బాధితులకు రూ.5,000 నుంచి రూ.10,000కు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.5,000 నుంచి రూ.15,000కు పెంచి ఆదుకుంటున్నామన్నారు.
అర్హులందరికీ పెన్షన్.. పారదర్శక పాలన
అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించామని, ఇప్పటికే రెండు రోజుల్లో 2.30 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. దరఖాస్తుల పరిశీలనకు పాత నిబంధనలనే అనుసరిస్తున్నామని, ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధికంగా ఏటా రూ.33,000 కోట్లను పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఇది తెలంగాణ కంటే నాలుగు రెట్లు అధికమని పోల్చారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు రివర్స్ టెండరింగ్‌తో నాశనమైన పోలవరం వంటి ప్రాజెక్టులను చక్కదిద్దుతూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని, వైసీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.