తన మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరడంపై బొత్స స్పందన

తన మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరడంపై బొత్స స్పందన

Botsa Satyanarayana reaction on nephew Chinna Srinu joining TDP
  • చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన చిన్న శ్రీను
  • రాజకీయాల్లో మనిషి అనేవాడికి స్వార్థం ఉంటుందన్న బొత్స
  • రాజకీయాల్లో పార్టీలు మాత్రమే శాశ్వతమని వ్యాఖ్య

వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి రాజీనామా చేసి... ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ స్పందించారు. 


విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ... "రాజకీయాల్లో మనిషి అనేవాడికి స్వార్థం ఉంటుంది. మనుషులు వస్తుంటారు, పోతుంటారు. కానీ రాజకీయ పార్టీలు మాత్రమే శాశ్వతం. వైసీపీకి ఇది కొత్తేమీ కాదు. పార్టీ తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతుంది" అని అన్నారు. 


కుటుంబ సభ్యుల నిర్ణయాలకు, తమ రాజకీయ ప్రయాణానికి ఎలాంటి సంబంధం లేదని బొత్స స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్య నేతగా, జెడ్పీ ఛైర్మన్‌గా ఉన్న చిన్న శ్రీను రాజీనామాతో విజయనగరం, విశాఖ జిల్లాల వైసీపీలో ఒక్కసారిగా రాజకీయ అలజడి రేగింది.

Advertisement
Botsa Satyanarayana
Majji Srinivasa Rao
Chinna Srinu
YSRCP
TDP
Andhra Pradesh Politics

More Telugu News