జావా 42 అల్ స్టార్స్ ఎడిషన్ విడుదల.. ధర ఎంతంటే?
- జావా 42 అల్ స్టార్స్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.1.85 లక్షలు
- స్టాండర్డ్ మోడల్ కంటే రూ.10,000 అదనపు ధర
- కొత్త గ్రాఫిక్స్, స్టార్ డీటెయిలింగ్‌తో కాస్మెటిక్ మార్పులు
- 294.72 సీసీ ఇంజిన్‌తో 27.1 హెచ్‌పీ శక్తి
- బుకింగ్స్ ప్రారంభం.. సెప్టెంబర్ 14 నుంచి డెలివరీలు
పండగ సీజన్ డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు క్లాసిక్ లెజెండ్స్ కొత్త జావా 42 అల్ స్టార్స్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్). సాధారణ జావా 42 మోడళ్లతో పోలిస్తే అల్ స్టార్స్ ఎడిషన్‌పై రూ.10,000 అదనంగా వసూలు చేస్తున్నారు. అయితే ఇంజిన్, ఇతర భాగాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
జావా 42 అల్ స్టార్స్‌లో ప్రధానంగా డిజైన్ మార్పులు చేశారు. కొత్త గ్రాఫిక్స్, స్టార్ థీమ్ డీటెయిలింగ్, ప్రత్యేకమైన అల్ స్టార్స్ బ్యాడ్జింగ్ ఇందులో ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో ఆనంద్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్ 2026 సందర్భంగా జావా 42 బాబర్ అల్ స్టార్స్‌ను ఆవిష్కరించారు. దీని ధర రూ.2.09 లక్షలు (ఎక్స్-షోరూమ్).
జావా 42లో 294.72 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ డీఓహెచ్‌సీ ఇంజిన్ ఉంటుంది. ఇది 27.1 హెచ్‌పీ శక్తి, 26.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు గేర్ల గేర్‌బాక్స్‌తో ఇంజిన్‌ను జత చేశారు. ముందు 280 మి.మీ., వెనుక 240 మి.మీ. డిస్క్ బ్రేకులు ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందించారు. బైక్ వీల్‌బేస్ 1,369 మి.మీ. కాగా.. సీటు ఎత్తు 795 మి.మీ.
జావా 42 అల్ స్టార్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 14 నుంచి కస్టమర్ డెలివరీలు మొదలవుతాయి. జావా 42 అల్ స్టార్స్ ధరలు ఇలా ఉన్నాయి: అల్ స్టార్స్ ఐవరీ రూ.1,84,942, నెబ్యులా బ్లూ రూ.1,86,942, బ్యాటిల్ గ్రీన్ రూ.1,86,942, మాస్ గ్రే రూ.1,86,942, బ్లాక్ రూ.1,89,942. అల్ స్టార్స్ బాబర్ ధరలు రూ.2,08,942 నుంచి రూ.2,19,942 వరకు ఉన్నాయి.