ఈ ఫ్రైడే ఓటీటీ ట్రాక్ పైకి వస్తున్న మూవీస్ ఇవే!

ఈ ఫ్రైడే ఓటీటీ ట్రాక్ పైకి వస్తున్న మూవీస్ ఇవే!

OTT Movies Update
  • సూర్య హీరోగా రూపొందిన 'విశ్వనాథ్ అండ్ సన్స్'
  • ఈ నెల 11వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ 
  • 11వ తేదీనే అమెజాన్ ప్రైమ్ లో రానున్న 'మకుటం'
  • విశాల్ డైరెక్ట్ చేసిన యాక్షన్ మూవీ ఇది
  • అదే రోజున స్ట్రీమింగ్ కి వస్తున్న మలయాళ మూవీ 'వరవు'
  • 'జీ 5' ద్వారా పలకరించనున్న కంటెంట్  

ప్రతి ఫ్రైడే ఓటీటీ ట్రాక్ పైకి కొన్ని సినిమాలు దిగిపోతూనే ఉన్నాయి. తమిళ .. మలయాళ సినిమాలు, తెలుగు ఆడియోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలా ఈ వారం ఇక్కడ వాలిపోయిన సినిమాల జాబితాలో, ముందుగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' కనిపిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సూర్య - మమితా బైజు ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆగస్టు 14వ తేదీన విడుదలైన ఈ సినిమా, 250 కోట్లకి పైకి వసూళ్లను రాబట్టింది. ఈ నెల 11వ తేదీ నుంచి  'నెట్ ఫ్లిక్స్'లో ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది. 

విశాల్ హీరోగా నటించిన 'మకుటం' సినిమా కూడా ఈ నెలలోనే ఓటీటీకి వచ్చేస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ యాక్షన్ డ్రామా, ఆగస్టు 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. విశాల్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా అంజలి .. దుషారా విజయన్ అలరించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' ఓటీటీకి రావడానికి సిద్ధమవుతోంది. ఇది విశాల్ దర్శకత్వం వహించిన సినిమా కావడం మరో విశేషం. 

ఇక మలయాళం నుంచి 'వరవు' అనే సినిమా కూడా ఈ నెల 11వ తేదీన బరిలోకి దిగిపోతోంది. 'జీ 5' వారు ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్నారు. షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, జోజు జార్జ్ కథానాయకుడిగా నటించాడు. మిగతా ముఖ్యమైన పాత్రలలో, మురళి గోపి .. అర్జున్ అశోకన్ .. దీపక్ పరంబోల్ కనిపించనున్నారు. జులై 16న థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి, పాజిటివ్ టాక్ వచ్చింది. మరో ఓటీటీ వైవు నుంచి ఏ స్థాయిలో సందడి చేస్తుందనేది చూడాలి. 


Advertisement
OTT Releases
Vishal Makutam
Joju George Varavu
Netflix Amazon Prime Zee5
New Movies This Friday
Mamitha Baiju Suriya

More Telugu News