మలయాళం నుంచి ఒక కామెడీ ఎంటర్టైనర్ ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైమ్ లూప్ కాన్సెప్ట్ తో నడిచే కామెడీ సినిమా ఇది. సజిన్ గోపు - నిఖిలా విమల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి సుధీ మాడిసన్ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 25వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కుట్టన్ (సజిన్ గోపు) తన పెళ్లి విషయంలో బెంగ పెట్టేసుకుంటాడు. తాను పెద్ద అందగాడిని కాననే నమ్మకం ఒక వైపు .. పెళ్లి వయసు దాటిపోయాననే ఆందోళన ఒక వైపు ఆయనను సతమతం చేస్తుంటాయి. అలాంటి పరిస్థితులలోనే ఆయనను పెళ్లి చేసుకోవడానికి షర్మిళ ( నిఖిలా విమల్) ఒప్పుకుంటుంది. అంత అందమైన అమ్మాయి తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడాన్ని అతని నమ్మలేకపోతాడు. ఆ విషయాన్ని జీర్ణించుకోవడానికి ఆయనకి చాలా సమయం పడుతుంది.
పెళ్లి పనులు జరుగుతున్న సమయంలోనే, 'ధూమకేతు' అనే ఒక తోకచుక్క భూమికి దగ్గరగా దూసుకెళ్లనుందనే వార్త టీవీలలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రభావం వలన అనేక మార్పులు జరిగే అవకాశం ఉందని నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులలోనే షర్మిళతో కుట్టన్ పెళ్లి జరిగిపోతుంది. వాళ్ల శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. అయితే శోభనం రోజు రాత్రి మాస్క్ ధరించిన దుండగులు తనపై దాడి చేసి, శోభనాన్ని అడ్డుకున్నట్టుగా అతనికి అనిపిస్తుంది.
నిద్రలేచిన తరువాత .. అప్పటివరకూ ఏవైతే సంఘటనలు తన అనుభవంలోకి వచ్చాయో, మళ్లీ అవే సంఘటనలు అలాగే జరుగుతూ ఉంటాయి. శోభనం గదిలోకి అడుగుపెట్టిన ప్రతిసారి తనపై దాడి జరగడం, నిద్రలేచిన తరువాత .. అవే సంఘటనలు జరగడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శోభనం రాత్రి తనపై దాడి జరగడం .. మళ్లీ అదేరోజు ఉదయానికి తాను చేరుకోవడం ఒక టైమ్ లూప్ లో జరుగుతుందనే విషయం కుట్టన్ కి అర్థమవుతుంది. దాంతో జరుగుతున్న సంఘటనలను తనకి అనుకూలంగా మార్చాలని నిర్ణయించుకుంటాడు.
అయితే తనపై దాడి చేస్తున్న మాస్క్ మనుషులు ఎవరై ఉంటారనేది అతను కనుక్కోలేకపోతాడు. వాళ్లు కొమ్మాడి కరియా మనుషులు అయ్యుంటారనే అనుమానాన్ని అతను షర్మిళ దగ్గర వ్యక్తం చేస్తాడు. శేఖరన్ కుట్టి మనుషులు కూడా కావొచ్చనే సందేహాన్ని షర్మిళ వ్యక్తం చేస్తుంది. ఆ గ్యాంగ్ లీడర్లు ఎవరు? ఈ జంటతో వాళ్లకి గల సంబంధం ఏమిటి? ఈ సమస్య నుంచి ఈ జంట ఎలా బయటపడుతుంది? అనేది మిగతా కథ.
టైమ్ లూప్ కాన్సెప్ట్ తో గతంలోను కొన్ని సినిమాలు వచ్చాయి. ఇక ఈ మధ్య కాలంలో ఈ తరహా కాన్సెప్ట్ తో వస్తున్న సిరీస్ లు .. సినిమాల సంఖ్య పెరుగుతోంది. ఒక ప్రదేశానికి సంబంధించిన .. ఒక సంఘటనకి సంబంధించిన టైమ్ లూప్ కథలు ప్రేక్షకులను అలరిస్తూ వెళుతున్నాయి. అలాంటి ఒక కథతో రూపొందిన సినిమాగా 'ధూమకేతు' కనిపిస్తుంది. తోకచుక్కతో ముడిపడి ఉండటం ఈ సినిమా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
ఒకరోజుకి సంబంధించిన టైమ్ లూప్ లో చిక్కుకున్న హీరో .. అతని శోభనం చుట్టూ అల్లుకున్న కథ ఇది. పెళ్లికి సంబంధించిన పనులు .. బంధువుల సమక్షంలో పెళ్లి .. భోజనాలు .. శోభనం .. అనే అంశాలను కలుపుకుంటూ ఈ కథ పరిగెడుతుంది. హీరోకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది? అతనిపై దాడి చేస్తున్న మాస్క్ మనుషులు ఎవరు? అనేది ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాను చెప్పదలచుకున్న విషయాన్ని కామెడీ టచ్ తో చెప్పాలని దర్శకుడు భావించాడు. ఆ దిశగానే అతను ఈ కథను ముందుకు తీసుకెళ్లాడు. అయితే టైమ్ లూప్ కథలలో ఒకే సన్నివేశం చిన్న చిన్న మార్పులతో మళ్లీ మళ్లీ తెరపైకి వస్తుంటుంది. అందువలన చూస్తున్న సన్నివేశాలని పదే పదే చూడవలసి రావడం ఆడియన్స్ కి కాస్త అసహనాన్ని కలిగిస్తుంది. ఈ సినిమా విషయంలోను అదే జరుగుతుంది.
ఇక టైమ్ లూప్ అనేది ఒకే వ్యక్తి విషయంలో జరగడం వంటి విషయాలపై ఎలాంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. చూస్తున్న ఆ కాసేపు సరదాగా నవ్వుకున్నామా లేదా అన్నట్టుగానే ఈ కథ ముందుకు వెళుతుంది. ఇక టైమ్ లూప్ తో పాటు కొమ్మాడి కరియా గ్యాంగ్ ను .. శేఖర్ కుట్టి గ్యాంగ్ ను తెరపైకి తీసుకొచ్చారుగానీ, ఆ ట్రాకులు కూడా అంత బలంగా ఏమీ అనిపించవు. వాటి వైపు నుంచి ఆశించిన స్థాయి వినోదం కూడా పండలేదు.
సజిన్ గోపు .. నిఖిలా విమల్ నటన ఆకట్టుకుంటుంది. చివరి అరగంటలో షైన్ టామ్ చాకో సందడి చేశాడు. జింటో జార్జ్ కెమెరా పనితనం .. అనిత మీనన్ నేపథ్య సంగీతం .. వివేక్ హర్షన్ ఎడిటింగ్ ఫరవాలేదు.
విలేజ్ నేపథ్యం .. సహజత్వంతో కూడిన చిత్రీకరణ ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. అయితే ఒకే అంశం చుట్టూ .. పదే పదే అవే సన్నివేశాలు ఎక్కువమార్లు తెరపైకి రావడం ప్రేక్షకులకు అసహనాన్ని కలిగిస్తుందనే చెప్పాలి.

Movie Details
Movie Name: Dhoomakethu
Genre: Comedy
Release Date: 2026-10-23
Cast: Sajin Gopu, Nikhila Vimal, Ganapathi S Poduval, Shine Tom Chacko, Sidharth Bharathan
Director: Sudhi Maddison
PRO: -
Music: Ankit Menon
Banner: Happy Hours
Review By: Peddinti