ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ .. సైకో పోలీస్ గా సునీల్!
- ఆర్య హీరోగా చేసిన 'అనంతన్ కాడు'
- తమిళ - మలయాళ భాషల్లో విడుదలైన సినిమా
- రాజకీయం - రౌడీయిజం నేపథ్యంలో సాగే కథ
- ఒకేసారి 5 ఓటీటీలలో స్ట్రీమింగ్
- కీలకమైన పాత్రలో మెప్పించిన సునీల్
తమిళంలో ఆర్యకి యాక్షన్ హీరోగా మంచి క్రేజ్ ఉంది. ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితమే. అలాంటి ఆర్య హీరోగా ఒక సినిమా రూపొందింది. ఆ సినిమా పేరే 'అనంతన్ కాడు'. తమిళ .. మలయాళ భాషలలో ఈ సినిమాను జీఎన్ కృష్ణకుమార్ తెరకెక్కించాడు. గోకులం గోపాలన్ నిర్మించిన ఈ సినిమా, జూన్ 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. అలాంటి ఈ సినిమా ఈ నెల 2వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' తో పాటు మరో నాలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి వచ్చింది.
ఆర్య కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, మురళీ గోపి .. దేవ్ మోహన్ .. ఇంద్రన్స్ ..
రెజీనా .. నిఖిల విమల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక సునీల్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కీలకమైన పాత్రను పోషించాడు. సైకో పోలీ ఆఫీసర్ గా ఈ సినిమాలో ఆయన నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే టాక్ వచ్చింది. సునీల్ ఇంతవరకూ చేసిన నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలతో పోల్చుకుంటే, ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు.
1990లలో .. తిరువనంతపురం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అక్కడి రాజకీయాలు .. రౌడీయిజాలు ప్రజలను భయపెడుతూ ఉంటాయి. అలాంటి గొడవలతో మనకెందుకులే అనుకుని పక్కకి తప్పుకుని వెళ్లిపోయే ఒక యువకుడు, అనుకోకుండా ఆ గొడవలలోకి లాగబడతాడు. అప్పటి నుంచి ఆయన జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది కథ. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ సినిమాను తెలుగు ఆడియోలో చూడాలనుకుంటే, లైన్స్ గేట్ ప్లే'లో మాత్రమే అవకాశం ఉంది.