భార్య తల నరికి ఫ్రిజ్‌లో.. అస్సలు పశ్చాత్తాపం లేదన్న భర్త!

భార్య తల నరికి ఫ్రిజ్‌లో.. అస్సలు పశ్చాత్తాపం లేదన్న భర్త!

Ramanuj Goswami beheads wife and keeps head in fridge with no remorse
  • గువాహటిలో భార్యను కిరాతకంగా హత్య చేసిన క్యాబ్ డ్రైవర్
  • తల నరికి ఫ్రిజ్‌లో పెట్టి పోలీసులకు లొంగిపోయిన భర్త
  • వివాహేతర సంబంధంపై అనుమానమే హత్యకు కారణమని ఆరోపణ
  • జైలు నుంచి వస్తే ప్రియుడిని చంపుతానని హెచ్చరిక
  • నిందితుడిని ఏడు రోజుల పోలీస్ కస్టడీకి పంపిన కోర్టు
వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆమె తలను నరికి ఫ్రిజ్‌లో దాచి పైశాచిక ఆనందం పొందాడు. ఈ దారుణ ఘటన అస్సాంలోని గువాహటిలో చోటుచేసుకుంది. అంతేకాదు, తాను చేసిన నేరానికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదని, జైలు నుంచి బయటకు వస్తే ఆమె ప్రియుడిగా అనుమానిస్తున్న వ్యక్తిని కూడా చంపుతానని పోలీసుల ఎదుట హెచ్చరించడం సంచలనం రేపుతోంది.

గువాహటికి చెందిన రామానుజ్ గోస్వామి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి గతేడాది సెప్టెంబర్ 22న రియా తాలూక్‌దార్ గోస్వామి (25)తో వివాహమైంది. బెల్టోలా ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. అయితే, తన భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో రామానుజ్ తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం మొదలైన వాగ్వివాదం 4వ తేదీ తెల్లవారుజాము వరకు కొనసాగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన రామానుజ్, ఇంట్లో ఉన్న పెద్ద కత్తితో (స్థానికంగా 'దావ్' అంటారు) భార్యపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె తలను మొండెం నుంచి వేరు చేసి, ఓ ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఆమె వేళ్లలో కొన్నింటిని కూడా నరికేశాడు.

రియా తల్లిదండ్రులు చనిపోగా, ఆమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. దంపతుల నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారి ఇంటికి చేరుకుని చూడగా, లోపలి నుంచి దుర్వాసన రావడంతో తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రియా మృతదేహాన్ని గుర్తించారు. హత్య జరిగి 24 నుంచి 48 గంటలు గడిచి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ ఘటన తర్వాత రామానుజ్ గోస్వామి ఆదివారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. "అవును, నేనే ఆమెను చంపాను. భవిష్యత్తులో నేను జైలు నుంచి బయటకు వస్తే, ఆమె 'షుగర్ డాడీ'ని కూడా నరికి చంపుతాను" అని పోలీసుల ఎదుట నిస్సంకోచంగా చెప్పాడు. అతడిని కోర్టులో హాజరుపరచగా, ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి లభించింది. నిందితుడికి హెచ్‌ఐవీ, హెపటైటిస్-సి ఉన్నట్లు, గతంలో డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స తీసుకున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, హత్యకు దారితీసిన పరిస్థితులు, వివాహేతర సంబంధం ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Ramanuj Goswami
Guwahati murder case
Assam crime news
Riya Talukdar Goswami
Wife beheaded in Guwahati
Extramarital affair murder

More Telugu News