ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకునే ప్రధాని ఎవరో తెలుసా?
- రూ.27 కోట్లకు పెరగనున్న సింగపూర్ ప్రధాని వార్షిక వేతనం
- తాజాగా రూ.10.5 కోట్లు పెరిగిన వైనం
- డిప్యూటీ ప్రధానికి సుమారు రూ.23 కోట్ల వేతనం
- మంత్రులకు రూ.13.5–21.6 కోట్ల జీతం
- పెరిగిన మొత్తాన్ని విరాళంగా ఇస్తానన్న వాంగ్
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ జీతం భారీగా పెరగనుంది. రాజకీయ నేతల వేతనాలను పెంచుతున్నట్లు ఆయన మంగళవారం పార్లమెంటులో ప్రకటించారు. దీంతో ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న సింగపూర్ రాజకీయ నేతల జీతాలు మరో 60 శాతానికిపైగా పెరగనున్నాయి.
ప్రస్తుతం ప్రధాని వార్షిక బెంచ్‌మార్క్ వేతనం 2.2 మిలియన్ సింగపూర్ డాలర్లు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.16.5 కోట్లు. తాజా పెంపుతో ఈ మొత్తం 3.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు చేరుతుంది. అంటే సుమారు రూ.27 కోట్లు. మొత్తంగా జీతం దాదాపు రూ.10.5 కోట్లు పెరగనుంది.
డిప్యూటీ ప్రధాని వేతనం 1.87 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 3.06 మిలియన్ డాలర్లకు పెరుగుతుంది. అంటే ప్రస్తుతం సుమారు రూ.14 కోట్లుగా ఉన్న జీతం రూ.23 కోట్లకు చేరనుంది. క్యాబినెట్ మంత్రులకు 1.80 మిలియన్ నుంచి 2.88 మిలియన్ సింగపూర్ డాలర్ల వరకు చెల్లిస్తారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.13.5 కోట్ల నుంచి రూ.21.6 కోట్ల వరకు ఉంటుంది.
తనకు పెరిగే మొత్తాన్ని పదవీకాలంలో వివిధ కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని వాంగ్ తెలిపారు. రాజకీయ నేతల జీతాల పెంపు ప్రజల్లో భావోద్వేగపూరిత అంశమని ఆయన అన్నారు. సామాన్యుల ఆదాయంతో పోలిస్తే ఈ జీతాలు చాలా ఎక్కువగా ఉండటంతో ప్రజలు వాటిని నిశితంగా పరిశీలించడం సహజమేనని చెప్పారు.
మంచి పాలనకు సమర్థ నాయకత్వం అవసరమని వాంగ్ తెలిపారు. భవిష్యత్తులో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నాణ్యమైన నాయకత్వాన్ని కొనసాగించడమే లక్ష్యమని వివరించారు.
మంత్రి వేతనాల పెంపు స్వతంత్ర కమిటీ సిఫార్సుల మేరకు జరిగింది. అయితే కొత్త వేతనాలను ప్రస్తుత పదవుల్లో ఉన్నవారికి వెంటనే వర్తింపజేయరు. అక్టోబర్ 15 నుంచి వ్యక్తిగత పరిస్థితులు, పనితీరును బట్టి గరిష్ఠంగా 9 శాతం వరకు ఒకేసారి సర్దుబాటు చేస్తారు. ఇకపై జీతాల్లో మార్పులు పనితీరు, బాధ్యతల ఆధారంగానే ఉంటాయని వాంగ్ చెప్పారు.