షాకవ్వొద్దు.. రూ.30 వేలకు దుబాయ్‌లో దొరికే అద్దె గది ఇంతే.. వీడియో వైరల్!
- దుబాయ్‌లో రూ.30 వేల గదిని చూపించిన భారతీయ మహిళ
- గది చిన్నదిగా ఉండటంతో వీడియో వైరల్
- ఒక్కరికి నెలకు రూ.30-33 వేల వరకు అద్దె
- ఇద్దరు ఉంటే రూ.36-39 వేల వరకు ఖర్చు
- గదిలో సామాన్లు పెట్టుకునే స్థలం చాలా తక్కువ
దుబాయ్ అంటే విలాసవంతమైన భవనాలు, ఖరీదైన కార్లు, భారీ జీతాలు గుర్తొస్తాయి. కానీ అక్కడ జీవితం అందరికీ అంత అందంగా ఉండదు. ముఖ్యంగా తక్కువ, మధ్యస్థ ఆదాయం ఉన్న ప్రవాసులు అద్దె ఖర్చులు తగ్గించుకునేందుకు చిన్న గదుల్లో ఉండాల్సి వస్తోంది. తాజాగా ఓ భారతీయ మహిళ దుబాయ్‌లో తాను ఉంటున్న చిన్న గదిని చూపిస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘దుబాయ్‌లో రూ.30 వేలకు మీకు ఏం దొరుకుతుంది?’ అంటూ ఆమె వీడియోను ప్రారంభించింది. అనంతరం గది మొత్తాన్ని చూపించింది. చిన్న దారిలో నుంచి వెళ్లగానే డ్యూప్లెక్స్ తరహాలో ఉన్న గది కనిపిస్తుంది. పై భాగంలో మంచం ఉంది. కింద చాలా తక్కువ స్థలం మాత్రమే ఉంది. సామాన్లు పెట్టుకునేందుకు కూడా పెద్దగా చోటు లేదు. గదిలో ఏసీ సదుపాయం కనిపించింది.
ఒక్కరు ఉంటే నెలకు 1,200 నుంచి 1,300 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుందని ఆమె తెలిపింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.30 వేల నుంచి రూ.33 వేల వరకు ఉంటుంది. ఇద్దరు కలిసి ఉంటే 1,400 నుంచి 1,500 దిర్హామ్‌లు ఖర్చవుతుందని చెప్పింది. అంటే దాదాపు రూ.36 వేల నుంచి రూ.39 వేల వరకు చెల్లించాలి.
గదిలో స్టోర్ చేసుకునే స్థలం చాలా తక్కువగా ఉందని ఆమె చూపించింది. దుస్తులు, లగేజీ వంటి వస్తువులను ఎక్కడ పెట్టుకోవాలో కూడా వీడియోలో వివరించింది.
ఈ వీడియోపై నెటిజన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఇలాంటి గదిలో ఉంటే ఊపిరాడనట్టుగా అనిపిస్తుందని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు దుబాయ్‌లో కొత్తగా అడుగుపెట్టినవారంతా మొదట్లో బెడ్‌స్పేస్‌లు, పార్టిషన్ గదుల్లోనే ఉంటారని గుర్తుచేశారు.
దుబాయ్‌లో విలాసవంతమైన ఇళ్లతో పాటు మంచి ఉద్యోగావకాశాలు ఉన్నా.. జీవన వ్యయం మాత్రం చాలామందికి సవాలుగా మారుతోంది. తక్కువ, మధ్యస్థ జీతాలు తీసుకునే వారికి ఆదాయంలో గణనీయమైన భాగం అద్దె, ఇతర నిత్యావసరాలకే వెచ్చించాల్సి వస్తోంది.