హైదరాబాద్ విషప్రయోగం కేసు: యూకే ఫార్మసిస్ట్ అప్పగింతకు లండన్ కోర్టు గ్రీన్ సిగ్నల్
- మాజీ భార్య కుటుంబంపై విషప్రయోగం కేసులో కీలక పరిణామం
- ప్రధాన నిందితుడు, యూకే ఫార్మసిస్ట్ అజిత్ కుమార్‌ను భారత్‌కు అప్పగించాలి
- ఈ మేరకు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఆదేశాలు జారీ
- ఆహారంలో ఆర్సెనిక్ కలిపి అత్త మృతికి కారణమయ్యాడన్న ఆరోపణలు
- మామ హత్యకు కూడా కుట్ర పన్నాడనే అభియోగాలు
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో మూడేళ్ల క్రితం జరిగిన సంచలన విషప్రయోగం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ భార్య కుటుంబాన్ని అంతమొందించేందుకు కుట్ర పన్ని, అత్త మృతికి కారణమయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న యూకే ఫార్మసిస్ట్ అజిత్ కుమార్ ముప్పారపు (46)ను భారత్‌కు అప్పగించేందుకు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతి ఇచ్చింది.
భారత సంతతికి చెందిన యూకే పౌరుడైన అజిత్ కుమార్ నుంచి విడాకులు కోరుతూ అతడి భార్య శిరీష 2023లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని మియాపూర్‌లో జరిగిన ఓ వివాహానికి శిరీష కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఇదే అదనుగా భావించిన అజిత్, వారిని హతమార్చేందుకు పథకం పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంట్లో వాడే ఉప్పు, కారంలో ఆర్సెనిక్ విషాన్ని కలిపాడని, ఆ ఆహారం తిన్న శిరీష తల్లి ఉమామహేశ్వరి తీవ్ర అస్వస్థతకు గురై 2023 జులై 5న మరణించారు. వైద్య పరీక్షల్లో ఆమె శరీరంలో సాధారణ స్థాయి కంటే అత్యధికంగా ఆర్సెనిక్ ఉన్నట్లు తేలడంతో ఇది హత్యేనని నిర్ధారణ అయింది.
కేవలం విషప్రయోగమే కాకుండా, శిరీష తండ్రి హనుమంతరావును హత్య చేసేందుకు అజిత్ పలుమార్లు ప్రయత్నించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కిరాయి హంతకులకు సుపారీ ఇవ్వడం, కండరాలను పనిచేయకుండా చేసే ఇంజెక్షన్ ద్వారా చంపేందుకు ప్లాన్ చేయడం వంటి అభియోగాలు కూడా ఉన్నాయి.
అజిత్ బ్రిటన్ పౌరుడు కావడంతో, సైబరాబాద్ పోలీసులు ఇంటర్‌పోల్ ద్వారా అతడిని భారత్‌కు రప్పించే ప్రయత్నాలు చేశారు. భారత అధికారులు లండన్ కోర్టుకు బలమైన ఆధారాలు సమర్పించారు. తనకు ప్రాణహాని ఉందని అజిత్ చేసిన వాదనలను తోసిపుచ్చిన న్యాయస్థానం, అతడిని భారత్‌కు అప్పగించేందుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే, ఈ తీర్పుపై అజిత్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నందున, అతడిని హైదరాబాద్‌కు తీసుకురావడానికి మరికొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది.