స్థానిక సమరానికి పవన్ కల్యాణ్ వ్యూహం.. నియోజకవర్గాల వారీగా కమిటీలు

Pawan Kalyan Strategy For Local Body Elections And Constituency Committees
  • స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన సమన్వయ కమిటీలు
  • పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన నియామకాలు
  • నేతలు, జనసైనికులను ఎన్నికలకు సిద్ధం చేయడమే లక్ష్యం
  • సెప్టెంబర్ 9న మంగళగిరిలో కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం పార్టీ సమన్వయ కమిటీలను నియమించింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు జనసేన కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.

స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను, జనసైనికులను, వీరమహిళలను సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన ఈ కమిటీల నియామకం జరిగింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్, ముగ్గురు సమన్వయ కమిటీ సభ్యులు ఉంటారు. వీరితో పాటు, ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక సహాయకుడిని కూడా ఎంపిక చేశారు.

ఈ కమిటీలు తమ పరిధిలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమన్వయ బాధ్యతలు నిర్వర్తిస్తాయి. పార్టీ విధానాలకు అనుగుణంగా, పొత్తులోని మిత్రపక్షాలతో కలిసి పనిచేసేలా చూడటం వీరి ప్రధాన విధి.

ఈ కమిటీల సభ్యులందరికీ ఈ నెల 9వ తేదీన మంగళగిరిలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలపై కమిటీ సభ్యులకు పార్టీ అధినాయకత్వం దిశానిర్దేశం చేయనుంది.
Advertisement
Pawan Kalyan
Janasena Party
Local Body Elections
Andhra Pradesh Politics
Janasena Coordination Committees
Mangalagiri

More Telugu News