కోటి ఇళ్లకు చేరిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’.. 41 రోజుల్లో కొత్త మైలురాయి

Intintiki Telugu Desam reaches one crore houses new milestone in 41 days
  • విజయవంతంగా 41వ రోజుకు చేరిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’
  • ఇప్పటివరకు 1.02 కోట్ల ఇళ్లను సందర్శించిన టీడీపీ నేతలు
  • రెండేళ్ల పాలనపై ప్రజలకు వివరిస్తున్న పార్టీ శ్రేణులు
  • కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని వెల్లడి
  • ఒక్కరోజే 1.51 లక్షల గృహాలకు చేరిన నాయకులు, కార్యకర్తలు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం సరికొత్త మైలురాయిని అధిగమించింది. 41 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 1.02 కోట్ల ఇళ్లను సందర్శించినట్టు టీడీపీ ప్రకటించింది. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి గడపకూ వెళ్లి ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. కేవలం నిన్న‌ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1,51,227 ఇళ్లను సందర్శించారు. రైతులు, మహిళలు, యువత, పేదలకు అందుతున్న ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను తెలియజేస్తూనే, వారి సమస్యలు, అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, టీడీపీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రజా భాగస్వామ్యంతో విస్తృతంగా కొనసాగుతోంది.
Advertisement
Telugu Desam Party
Intintiki Telugu Desam
Andhra Pradesh Politics
TDP Campaign Milestone
AP Government Welfare Schemes
TDP Door to Door Program

More Telugu News