మిస్ వరల్డ్ 2026.. విజేతగా డొమినికన్ అమ్మాయి జోహెర్రీ మోలా డొమింగ్వెజ్
- మిస్ వరల్డ్ 2026 కిరీటం డొమినికన్ రిపబ్లిక్ సుందరి జోహెర్రీ డొమింగ్వెజ్ కైవసం
- వియత్నాంలో జరిగిన 73వ ప్రపంచ సుందరి పోటీలు
- భారత్ అందాలభామ నికితా పోర్వాల్‌కు టాప్ 20లో చోటు దక్కని వైనం
- టాప్ 40లో స్థానం సంపాదించి సరిపెట్టుకున్న నికిత
- మలేసియా, స్పెయిన్ సుందరీలకు రన్నరప్ స్థానాలు
వియత్నాం వేదికగా అట్టహాసంగా జరిగిన 73వ మిస్ వరల్డ్ 2026 పోటీలు ముగిశాయి. ఈ ప్రతిష్ఠాత్మక కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెర్రీ మోలా డొమింగ్వెజ్ గెలుచుకుంది. స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రెయిన్స్ మొదటి రన్నరప్‌గా, మలేసియాకు చెందిన తానూసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు. గత ఏడాది విజేత, థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ.. కొత్త ప్రపంచ సుందరికి కిరీటాన్ని అలంకరించింది.
కొత్త ప్రపంచ సుందరి జోహెర్రీ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు, సామాజిక కార్యకర్త. 'వాయిసెస్ ఆఫ్ టుమారో' అనే సంస్థ ద్వారా వెనుకబడిన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ విద్యను అందిస్తున్నారు. ఆమె కమ్యూనిటీ సేవ, విద్యారంగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ కిరీటం దక్కిందని పలువురు ప్రశంసిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ పోటీలకు టాంజానియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది చివర్లో ప్యూర్టోరికోలో జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున కాజియా లిజ్ మేజో పాల్గొననున్నారు.
ఈ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 నికితా పోర్వాల్ టాప్ 40 వరకు చేరుకుంది. అయితే, ఆ తర్వాతి రౌండ్‌లో టాప్ 20లో ఆమెకు చోటు దక్కకపోవడంతో భారత అభిమానులకు నిరాశ ఎదురైంది. అయినప్పటికీ, వరుసగా ఐదోసారి మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ స్థానం దక్కించుకునే పరంపరను నికితా కొనసాగించిందని, దేశానికి గర్వకారణంగా నిలిచారని మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ఓ ప్రకటనలో అభినందించింది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికితా పోర్వాల్.. గతంలో టీవీ యాంకర్‌గా పనిచేశారు. నటిగా కూడా రాణిస్తున్న ఆమె, 'చంబల్ పార్' అనే బ్రిజ్ భాషా చిత్రంలో నటించారు. ఫైనల్‌లో ఆమె ధరించిన ప్రత్యేకమైన గౌను అందరినీ ఆకట్టుకుంది.