రామప్ప ఆలయంలో చారిత్రక ఘట్టం.. 300 ఏళ్ల తర్వాత రుద్రేశ్వరుడికి పూర్తిస్థాయి జలాభిషేకం

Ramappa Temple marks historical moment with full Jalabhishekam after 300 years
  • 17వ శతాబ్దంలో భూకంపం వల్ల మూసుకుపోయిన సోమసూత్రం పునరుద్ధరణ
  • ఆధునిక టెక్నాలజీతో ఆలయానికి నష్టం లేకుండా పనులు చేపట్టిన ఏఎస్‌ఐ
  • పురావస్తు, దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో విజయవంతమైన పనులు
ములుగు జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయంలో ఒక చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. సుమారు 300 సంవత్సరాలుగా నిలిచిపోయిన పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం శనివారం నుంచి మళ్లీ ప్రారంభమైంది. ఆలయంలోని గర్భగుడిలో కొలువుదీరిన రుద్రేశ్వర స్వామికి సంపూర్ణ అభిషేకాలు చేసేందుకు మార్గం సుగమమైంది.

17వ శతాబ్దంలో సంభవించిన భూకంపం కారణంగా గర్భగుడి నుంచి అభిషేక జలాలు బయటకు వెళ్లే సంప్రదాయ మార్గం 'సోమసూత్రం' మూసుకుపోయింది. దీంతో ఇన్ని శతాబ్దాలుగా స్వామివారికి పరిపూర్ణ అభిషేకాలు నిర్వహించడం సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) హైదరాబాద్ సర్కిల్ బృందం, దేవాదాయ శాఖ అధికారులు కలిసి శాస్త్రీయ పద్ధతిలో పునరుద్ధరణ పనులు చేపట్టారు.

ఆలయ నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా 3డీ మ్యాపింగ్, ఎండోస్కోపిక్ కెమెరాల సహాయంతో అడ్డంకులను గుర్తించారు. అనంతరం 'సాఫ్ట్ డ్రిల్లింగ్' అనే ఆధునిక విధానాన్ని ఉపయోగించి పొరలుపొరలుగా అడ్డంకులను జాగ్రత్తగా తొలగించారు. దీంతో మూడు శతాబ్దాల తర్వాత సోమసూత్రం తిరిగి వినియోగంలోకి వచ్చింది. 
Advertisement
Ramappa Temple
Rudreshwara Swamy
UNESCO World Heritage Site
Archaeological Survey of India
Mulugu District
Somasutram Restoration

More Telugu News